సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Nithiin: తమ్ముడు కోసం పారితోషికం తగ్గించుకున్న నితిన్..

ABN, Publish Date - Jun 11 , 2025 | 10:09 PM

యంగ్ హీరో నితిన్(Nithiin) ఒక కొత్త పద్దతికి నాంది పలికాడు. సినిమా హిట్ అయ్యాకనే రెమ్యూనరేషన్ ఫిక్స్ చేసి ఇవ్వమని నిర్మాతలకు చెప్పినట్లు తెలుస్తోంది.

Nithiin

Nithiin: ప్రస్తుతం టాలీవుడ్ పరిస్థితి ఏమి బాగాలేదు. భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ అవుతున్నా.. కొన్ని మాత్రమే విజయాల బాట పడుతున్నాయి. కంటెంట్ ఉన్న మాత్రమే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.   స్టార్ హీరోలు.. నిర్మాతలకు నష్టాలనే మిగులుస్తున్నారు. భారీ బడ్జెట్ లు  పెట్టలేక నిర్మాతలు ఆస్తులను అమ్ముకుంటున్నారు. ఆ బడ్జెట్ లో కొన్ని కోట్లు హీరోల రెమ్యూనరేషన్స్ కే పోతున్నాయి. హీరోలు పారితోషికాలు తగ్గించుకుంటే కచ్చితంగా నిర్మాతలు నష్టపోరని చాలామంది చెప్పుకొచ్చారు. ఇక ఈ మధ్యకాలంలో హీరోలు కూడా గొప్ప మనసును చాటుకుంటున్నారు. సినిమా కనుక నష్టపోతే.. తాము తీసుకున్న రెమ్యూనరేషన్ ను వెనక్కి ఇచ్చేస్తున్నారు. 

 

 అయితే తాజాగా యంగ్ హీరో నితిన్(Nithiin) ఒక కొత్త పద్దతికి నాంది పలికాడు. సినిమా హిట్ అయ్యాకనే రెమ్యూనరేషన్ ఫిక్స్ చేసి ఇవ్వమని నిర్మాతలకు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్నీ దిల్ రాజు(Dil Raju).. తమ్ముడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో చెప్పుకొచ్చాడు. నితిన్ హీరోగా వేణు శ్రీరామ్(Venu Sriram) దర్శకత్వంలో తెరకెక్కిన తమ్ముడు సినిమా జూలై 4 న రిలీజ్ కానుంది.  రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో  ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్  తాజాగా తమ్ముడు ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో దిల్ రాజు.. నితిన్, డైరెక్టర్ వేణు శ్రీరామ్ తన వద్ద రూపాయి కూడా తీసుకోలేదని చెప్పుకొచ్చాడు.

 

Dil Raju: దిల్ రాజు షాకింగ్ నిర్ణయం.. ఇక నుంచి వ్యూస్ కొనాలనుకోవడం లేదు 

 

" వకీల్ సాబ్ తరువాత ఐకాన్ అనుకున్నాం. అది లేట్ అవ్వడంతో తమ్ముడు మొదలుపెట్టాడు. అలా చేసుకుంటూ వెళ్తున్నాం. ఏంటి వేణు ఇది అని అడిగాను. సార్.. కథ చెప్పినప్పుడే చెప్పాను కదా.  సౌండ్ చాలా ముఖ్యం.. బాగా తీయాలి సార్ అని చెప్పాడు. సరే ఒక నిర్మాతగా రెవిన్యూ నాకు రిటర్న్ రావడమేగా అనుకున్నా.. బడ్జెట్ పెరిగిపోతుంది. ఇప్పుడెలా అనుకున్న సమయంలో వేణు వచ్చి సార్ ఈరోజు వరకు నేను ఇంతే డ్రా చేశాను. రేపటి నుంచి ఒక్క రూపాయి కూడా డ్రా చేయను అని చెప్పాడు. నా 22 ఏళ్ల కెరీర్ లో అదోక సర్ప్రైజ్ మూమెంట్. సినిమా హిట్ అయ్యాక మీరే పిలిచి ఇవ్వండి ఎంతైతే అంత అన్నాడు. థాంక్యూ వేణు. ఒక డైరెక్టర్ ను నిర్మాతలు సపోర్ట్ చేసినట్లు .. ఒక డైరెక్టర్ కూడా సినిమాకు సపోర్ట్ చేయడం చాలా అవసరం.

 

 వేణునే కాదు నితిన్ కూడా.. ఏంటి నితిన్ ఇలా ఉంది ఏం చేద్దాం అంటే.. అంకుల్ మీరెంత పంపియాలనుకుంటునన్నారో అంత పంపించండి. నేను రెమ్యూనరేషన్ గురించి పెద్దగా ఆలోచించడం లేదు అని చెప్పాడు. సక్సెస్ వచ్చినప్పుడు అందరి రెమ్యూనరేషన్స్ పెరుగుతాయి. ఫెయిల్యూర్  వచ్చినప్పుడు మాత్రం నిర్మాత, డిస్ట్రిబ్యూటరే డ్యామేజ్ అవుతాడు. అందుకని నా హీరోకు, డైరెక్టర్ కు త్యాంక్స్ చెప్తున్నాను. వీరందరూ సపోర్ట్ చేస్తేనే సక్సెస్ అయ్యాక అందరూ ఎంజాయ్ చేయగలుగుతాం" అని చెప్పుకొచ్చాడు. ఇక నితిన్ కేవలం ఈ సినిమా కోసమే పారితోషికం తగ్గించుకున్నాడా.. ?  తరువాత తీసే సినిమాలన్నింటికి ఇదే పద్దతిని పాటిస్తాడా.. ? అని అంటే.. తన తరువాత సినిమా ఎల్లమ్మకు కూడా ఇదే విధంగా చేయబోతున్నట్లు చెప్పుకొచ్చాడు. నితిన్ లా మిగతా హీరోలు కూడా .. సినిమా రిలీజ్ కు ముందు కాకుండా హిట్ అయ్యాక రెమ్యూనరేషన్స్ తీసుకుంటే చాలామంది నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు నష్టాల నుంచి బయటపడినట్టే. మరి ఈ పద్దతిని మిగతా హీరోలు పాటిస్తారా.. ? లేదా .. ? అనేది చూడాలి. 

Updated Date - Jun 11 , 2025 | 10:09 PM