Kuberaa Vs Squid Game: ఇదేంటి.. కుబేర, స్క్విడ్ గేమ్ ఒకేలా ఉన్నాయి
ABN, Publish Date - Jul 07 , 2025 | 12:53 PM
ఇటీవలే విడుదలైన వరల్డ్ ఫేమస్ వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్, కుబేర సినిమాలకు దగ్గరి పోలికలు, ఒకే తరహా క్లైమాక్స్ ఉన్న సంగతి చాలా మంది గుర్తించక పోయి ఉండొచ్చు.
గత నెలలో థియేటర్లలోకి వచ్చి మంచి విజయం సాధించి భారీ కలెక్షన్లు రాబట్టిన చిత్రం కుబేర (Kuberaa). సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల (Sekhar Kammula) తన రెగ్యులర్ శైలికి భిన్నంగా తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించి రాబట్టింది. అంతేగాక ఈ యేడు టాలీవుడ్ హయ్యస్ట్ గ్రాసర్‌లలో ఒకటిగా నిలిచింది. ధనుష్ (Dhanush), నాగార్జున (Nagarjuna), రష్మికల యాక్టింగ్‌కు ప్రశంసలు లభించడంతో పాటు ధనుష్‌కు జాతీయ అవార్డు అవార్డు గ్యారంటీగా వస్తుందన్న చిరంజీవి వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అయితే.. ఇటీవలే విడుదలైన ఓ వరల్డ్ ఫేమస్ వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్‌కు, ఈ కుబేర సినిమాకు దగ్గరి పోలికలు, ఒకే తరహాలో ఉన్న సంగతి చాలా మంది గుర్తించక పోయి ఉండొచ్చు. అయితే ఇప్పుడే ఈ క్రింది పైర్తి స్టోరీని చదివేవాక మారే అంంటారు అవును.. నిజమే కదా.. నాకెందుకు తట్టలేదు చెప్మా అంటూ మీలో మీరే అనుకోవడం మాత్రం గ్యారంటీ.
కుబేర సినిమాలో దేశంలోని బిజినెస్ టైకున్‌ల గేమ్‌లోకి అనుకోకుండా ఓ బిచ్చగాడు (హీరో) మరో ముగ్గురితో కలిసి గేమ్‌లోకి ఎంట్రీ ఇస్తాడు. తన తోటి వారు చనిపోతుండగా నిజాలు తెలుసుకున్న ఆ హీరో అక్కడి నుంచి బయట పడే క్రమంలో తన పేర వేల కొట్ల ఆస్తి ఉందని, ఈ క్రమంలో జరిగిన అన్ని వ్యవహారాలు బయటి ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేస్తాడు. అదే సమయంలో తనతో పాటు వచ్చిన బిచ్చగత్తె యువతి బతికే ఉందని, తను గర్బిణిగా ఉండడంతో అమెను రక్షించాలని చూస్తాడు. కానీ చివరకు ఆమె ఓ బిడ్డను కని చనిపోతుంది. సినిమా చివరకు వచ్చేసరికి ఆ బిడ్డ బాధ్యత హీరో తీసుకోగా తన పేర ఉన్న వేల కోట్ల ఆస్థికి ఆ బిడ్డే వారసుడని, అతనే కుబేర అని చెప్పి సినిమాకు ఎండ్ కార్డ్ వేస్తారు.
మరోవైపు.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న కొరియన్ వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్ (Squid Game Season 3). ఇప్పటికే రెండు భాగాలుగా వచ్చిన ఈ సిరీస్ టోటల్ వరల్డ్‌నే షేక్ చేసింది. ఇటీవలే ఈ సిరీస్ మూడవ సీజన్ కూడా ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చి అందరినీ ఉర్రూతలూగిస్తుంది. అయితే.. ఈ సిరీస్‌లో హీరో కొన్ని మిలియన్ల డాలర్ల డబ్బును గెలుచుకునేందుకు వందల మందితో కలిసి ఈ గేమ్‌లో పాల్గొంటారు. అక్కడ నిర్వహించిన గేమ్స్‌లో గెలిచిన వారు మాత్రమే బతికితే.. ఓడిన వారు చనిపోతారు. అలా చివరికి వచ్చే సరికి మిగిలిన ఒక్కరికి మాత్రమే ఆ డబ్బంతా అప్పజెప్తారు.
అలాంటి గేమ్ గురించి అక్కడ జరిగే దారుణాల గురించి ముందే తెలిసిన హీరో తోటి వారిని రక్షించాలని, గేమ్ నుంచి తిరిగి వెళ్లి పోవాలని అనేక ప్రయత్నాలు చేసి విఫలం అవుతాడు. అక్కడే గర్భవతిగా ఉన్న యువతితో అప్యాయల పెరగడం, ఆమెను ఎలాగైనా కాపాడాలని పలుమార్లు ట్రై చేసి ఫెయిల్ అవుతాడు. ఆపై ఆ యువతి ఓ బిడ్డను కని చనిపోగా ఆ బిడ్డను కూడా గేమ్‌లో మెంబర్‌గా ప్రకటిస్తూ గేమ్ నిర్వాహకులు వింత నిర్ణయం తీసుకుంటారు. దీంతో అప్పుడే పుట్టిన రోజుల శిశువు బాధ్యతను తనపై వేసుకున్న హీరో అనేక మందిని దాటుకుని పాపను చివరి గేమ్ వరకు కాపాడుకుంటూ వస్తాడు. ఆట చివరిలో పాప, తను మాత్రమే మిగులుతారు. ఎవరో ఒకరే మిగలాలి కాబట్టి హీరో పాపను బతికించి తను చనిపోతాడు. దీంతో గేమ్‌లో గెలిచిన డబ్బంతా ఆ పాపకే వెళుతుంది.
ఇప్పుడు.. ఈ కుబేర (Kuberaa) సినిమా, ఆ స్క్విడ్ గేమ్ (Squid Game Season 3) సిరీస్ కథలను పరిశీలిస్తే ఈ రెండింటికీ చాలా సారూపత్యలు ఉన్నట్లు మనకు ఇట్టే తెలుస్తుంది. దాదాపు రెండు క్లైమాక్స్‌లు ఒకేలా అనిపించడం, రెండింట్లోనూ అప్పుడే పుట్టిన పిల్లలు కీలకం అవడం గుర్తించాల్సిన అంశం. కుబేర సినిమాలో బిచ్చగాడు ఏం చేస్తున్నామో తెలియకుండానే ఆ గేమ్‌లోకి రావడం, చివరకు చిన్న బాబుతో వచ్చి డబ్బుకు వారసుడు అతనే అని చెబుతారు. స్క్విడ్ గేమ్‌లో అన్నీ తెలిసిన హీరో గేమ్‌లోకి రావడం చివరకు పాపను రక్షించి, తనకే డబ్బు చెందేలా చేస్తాడు. అందులో హీరో ధనుష్ బతికి ఉండడం, ఇందులో హీరో చనిపోవడం, అందులో విలన్ బిచ్చమెత్తి చనిపోతే, ఇందులో విలన్ ఎప్పటిలానే స్ట్రాంగ్‌గా ఉండడం మాత్రం తేడా.
అంతేకాదు.. ఈ రెండు కూడా ఒకే విషయాన్ని చర్చించడం విశేషం కాగా జనాలను అలరించేలా, జనరంజకంగా తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంటుంది. అన్నింటికీ ధనమే ముఖ్యం కాదు అంతకుమించి మానవత్యం, కుటుంబ సంబంధాలే ప్రధానం, అవసరం అంటూ ఈ రెండు కంటెంట్లు నేటి సమాజానికి మంచి మెసేజ్ అందించాయి. ఇదిలాఉంటే మరోవైపు శేఖర్ కమ్ముల ఈ స్టోరీపై మూడేండ్లకు పైగా ప్రయాణం చేయగా స్క్విడ్ గేమ్ కూడా ఇంచుమించు అదే సమయం తీసుకోవడం మరో విచిత్రం.