Raj Kundra: స్వామీజీకి కిడ్నీ దానం.. ఆ కేసును కప్పి పుచ్చడానికే

ABN , Publish Date - Aug 16 , 2025 | 09:49 AM

బాలీవుడ్ సెలబ్రిటీ రాజ్ కుంద్రా (Raj Kundra) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు అయితే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి(Shilpa Shetty) భర్తగా రాజ్ కుంద్రా కొంతమందికే తెలుసు.

Raj Kundra

Raj Kundra: బాలీవుడ్ సెలబ్రిటీ రాజ్ కుంద్రా (Raj Kundra) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు అయితే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి(Shilpa Shetty) భర్తగా రాజ్ కుంద్రా కొంతమందికే తెలుసు. ఎప్పుడైతే అతను అడల్ట్ వీడియోల కేసులో ఇరుక్కున్నాడో ప్రపంచమంతా రాజ్ కుంద్రా ముఖాన్ని కూడా గుర్తుపెట్టుకున్నారు. ప్రస్తుతం ఆ కేసు ఇంకా నడుస్తూనే ఉంది. దీంతో రాజ్ కుంద్రా బయట ముఖాన్ని చూపించలేక మాస్కులు పెట్టుకొని తిరుగుతున్నాడు. ఇక ఈ కేసు మాత్రమే కాకుండా ఈ మధ్య మరో కేసు కూడా వీరి నెత్తిమీద పడింది. రూ. 60 కోట్ల పెట్టుబడి స్కామ్ లో బార్యాభర్తలిద్దరూ చిక్కుకున్నారు.


ఇక నెత్తిమీద ఇన్ని ప్రాబ్లెమ్స్ పెట్టుకొని సడెన్ గా రాజ్ కుంద్రా - శిల్పాశెట్టి ఉత్తరప్రదేశ్ లో బాగా ఫేమస్ అయిన ప్రేమానంద్ మహారాజ్ స్వామిజీ ఆశీస్సులు తీసుకోవడానికి వెళ్లడం సంచలనంగా మారింది. ఆయనను కలిసి, ప్రత్యేక పూజలు నిర్వహించి అయన ఆశీర్వాదాలు అందుకున్నారు. ఇక్కడవరకు బాగానే ఉంది. ఇక స్వామిజీ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారని తెలుసుకున్న రాజ్ కుంద్రా.. సడెన్ గా తన కిడ్నీని దానం చేస్తాను అని ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం షాక్ కు గురిచేసింది. సొంత భార్య శిల్పా శెట్టినే ఆశ్చర్యపోయింది అంటే అతిశయోక్తి కాదు. ఇక ఈ వార్త తెలియగానే బాలీవుడ్ మొత్తం రాజ్ కుంద్రా మరోసారి పీఆర్ స్టంట్ చేశాడని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.


రూ. 60 కోట్ల స్కామ్ నుంచి జనాల దృష్టిని మళ్లించడానికి రాజ్ కుంద్రా వేసిన మాస్టర్ ప్లాన్ ఇది అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. అంతేకాకుండా ఇలాంటి స్టంట్స్ వేయడం వలన ప్రయోజనం లేదని కూడా కామెంట్స్ పెడుతున్నారు. తాజాగా ఈ ట్రోల్స్ పై రాజ్ కుంద్రా స్పందించాడు. మానవత్వంతో మంచి చేయాలనుకున్నా ఎగతాళి చేస్తే చేసుకోండి.. దానికి తానేమి బాధపడేది లేదని చెప్పుకొచ్చాడు. 'మనం జీవిస్తున్న ఈ ప్రపంచంలో మరొకరి ప్రాణాలు నిలబడతాయని మన శరీరంలోని ఒక భాగాన్ని తీసి ఇద్దామనుకున్నా దానిని కూడా ఎగతాళి చేస్తున్నారు. పీఆర్ స్టంట్స్ అని ట్రోల్ చేస్తున్నారు. మీరు అలా అనుకొంటే అనుకోండి. మీరు చేసే ట్రోల్స్ నా వ్యక్తిత్వాన్ని నిర్ణయించలేవు. మీ మెప్పు పొందడం కోసం నేనేమి ఇవి చేయడం లేదు. మనుషులను ఎక్కువ ప్రేమించండి. వారి గురించి తక్కువ మాట్లాడండి. అప్పుడే మీరు మరొకరి జీవితాల్లో వెలుగు నింపగలరు' అంటూ చెప్పుకొచ్చాడు.

Rashmika Mandana: 7 ఏళ్ల గీత గోవిందం.. ఇప్పటికీ నమ్మలేకపోతున్నా

యుద్ధ వీరుడిగా శ్రీకృష్ణుడు

Updated Date - Aug 16 , 2025 | 09:50 AM