Rashmika Mandanna: 7 ఏళ్ల గీత గోవిందం.. ఇప్పటికీ నమ్మలేకపోతున్నా

ABN , Publish Date - Aug 16 , 2025 | 09:10 AM

ప్రతి ఒక్క యాక్టర్ కెరీర్ లో గుర్తుండిపోయే ఒక చిత్రం ఉంటుంది. ఆ సినిమాకు ముందు.. తరువాత అని వారి కెరీర్ ను పోలుస్తారు. అలా నేషనల్ క్రష్ రశ్మికా మందన్న(Rashmika Mandanna)కు గీతగోవిందం(Geeta Govindam) సినిమా కెరీర్ బెస్ట్ చిత్రం అని చెప్పొచ్చు.

Geeta Govindam

Rashmika Mandana: ప్రతి ఒక్క యాక్టర్ కెరీర్ లో గుర్తుండిపోయే ఒక చిత్రం ఉంటుంది. ఆ సినిమాకు ముందు.. తరువాత అని వారి కెరీర్ ను పోలుస్తారు. అలా నేషనల్ క్రష్ రశ్మికా మందన్న(Rashmika Mandanna)కు గీతగోవిందం(Geeta Govindam) సినిమా కెరీర్ బెస్ట్ చిత్రం అని చెప్పొచ్చు. కిర్రాక్ పార్టీ అనే కన్నడ సినిమాతో రశ్మిక ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకొని కన్నడలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇక అక్కడే స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది అనుకుంటే.. ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.


అందం, అమాయకత్వం కలబోసిన రూపంతో ఛలో సినిమాలో కనిపించేసరికి తెలుగు యువత కొత్త క్రష్ ను గుండెల్లో యాడ్ చేసుకున్నారు. ఇక అప్పుడే అమ్మడికి గీత గోవిందం సినిమా ఆఫర్ వచ్చింది. అప్పటికే అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిన విజయ్ దేవరకొండ.. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తీయాలని ప్లాన్ చేశాడు. గీతా ఆర్ట్స్ లో పరుశురామ్ దర్శకత్వంలో గీతగోవిందం మొదలైంది. ఆ సమయంలోనే రశ్మికకు రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. పెళ్లి తరువాత సినిమాలు కంటిన్యూ కూడా చేయాలనుకుంది.


2018లో ఆగస్టు 15 న గీతగోవిందం రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. గీత పాత్రలో రశ్మిక తప్ప ఇంకెవ్వరూ నటించినా ఆ సినిమాకు అంత ఇంపాక్ట్ వచ్చి ఉండేది కాదని అభిమానులు బల్లగుద్ది చెప్పుకొచ్చారు. అందం, పొగరు, యాటిట్యూడ్,ప్రేమ.. ఇలా అన్ని భావాలను ఆమె గీత పాత్రలో చూపించింది. గీత లేకపోతే గోవింద్ పాత్రకు అసలు బలం వచ్చేదే కాదు అంటే అతిశయోక్తి కాదు. విజయ్ - రష్మిక కెరీర్ లో ఈ సినిమా ఒక మైల్ స్టోన్ గా మిగిలిపోయింది. ఈ సినిమా తరువాతే రశ్మిక ఎంగేజ్ మెంట్ ఆపేసుకుంది. దానికి కారణం విజయ్ అని కూడా వార్తలు వచ్చాయి. అప్పటినుంచే వీరి మధ్య ప్రేమాయణం మొదలైందని టాక్.


ఇక ఈ సినిమా తరువాత విజయ్ - రశ్మిక జీవితాలు మారిపోయాయి. నిన్నటితో ఈ సినిమా 7 ఏళ్లు పూర్తి చేసుకుంది. దీంతో రశ్మిక గీత గోవిందం సినిమాను గుర్తుచేసుకుంది. '7 సంవత్సరాల క్రితం తీసిన ఈ చిత్రాలన్నీ నా దగ్గర ఇంకా ఉన్నాయని నమ్మలేకపోతున్నాను.. ఈ సినిమా నాకు ఎల్లప్పుడూ ప్రత్యేకమైన చిత్రంగానే ఉంటుంది. ఈ సినిమాలో పనిచేసిన వారందరినీ నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను. ఇప్పుడు వారు అందరూ చాలా మంచి పొజిషన్స్ లో ఉన్నారు. గీతగోవిందం వచ్చి 7 ఏళ్లు అవుతుంది అంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. కానీ, ఆనందంగా ఉంది. హ్యాపీ 7 ఏళ్ల గీత గోవిందం' అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

పదిహేను చిత్రాలకు శ్రీకారం

‘అమ్మ’ అధ్యక్షురాలిగా శ్వేతా మీనన్‌!

Updated Date - Aug 16 , 2025 | 09:50 AM