సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Rashmika Mandanna: రష్మిక ముఖానికి సర్జరీ.. అసలేమైంది

ABN, Publish Date - Oct 26 , 2025 | 08:16 PM

ఇండస్ట్రీ .. ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ అందం అనేది చాలా ముఖ్యం. హీరోయిన్లకు అయితే అదే కెరీర్ అని చెప్పొచ్చు,

Rashmika Mandanna

Rashmika Mandanna: ఇండస్ట్రీ .. ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ అందం అనేది చాలా ముఖ్యం. హీరోయిన్లకు అయితే అదే కెరీర్ అని చెప్పొచ్చు, అందుకే హీరోయిన్లు పొట్ట మాడ్చుకొని ఫిట్ గా ఉండడానికి జిమ్ చేస్తారు. ఇక అందాన్ని పెంచుకోవడానికి సర్జరీలు అని, ఫేస్ ట్రీట్ మెంట్స్ అంటూ చేయిస్తునే ఉంటారు. అయితే ఈ మధ్య ప్రతి ఒక్కరు కూడా ఫేస్ ట్రీట్ మెంట్ చేయించుకుంటున్నారు. లిప్ ఫిల్లర్లు వేయిస్తున్నారు. కొంతమందికి అవి సెట్ అవుతున్నా ఇంకొంతమందికి అస్సలు సెట్ అవ్వడం లేదు.

ఇక ఇప్పుడు ఈ ఫేస్ ట్రీట్ మెంట్లు, సర్జరీల సంగతి ఎందుకు ఆంటే నేషనల్ క్రష్ రష్మిక మందన్నా సైతం ఆమె ముఖానికి ట్రీట్ మెంట్ చేయించింది. ఈ విషయాన్నీ రష్మికనే స్వయంగా చెప్పుకొచ్చింది. తాజాగా ఆమె ఎయిర్ పోర్ట్ లో ముఖానికి మాస్క్ తో కనిపించింది. సాధారణంగా సెలబ్రిటీలు అందరూ ముఖానికి మాస్క్ తోనే కనిపిస్తారు. కానీ, మీడియాకు ఫోటోలు ఇవ్వడానికి కచ్చితంగా మాస్క్ తీస్తారు.

నిన్న రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం హైదరాబాద్ కు వస్తూ ఎయిర్ పోర్టులో దర్శనమిచ్చింది. బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ ఫిట్ లో బ్లాక్ మాస్క్ తో కనిపించింది. అక్కడ ఉన్న కెమెరా మ్యాన్స్.. రష్మికను మాస్క్ తీయమని కోరగా.. ఫేస్ ట్రీట్ మెంట్ అయ్యింది గయ్స్.. తీయలేను అని చెప్పింది. దీంతో రష్మిక ముఖం అందంగానే ఉంటుంది కదా.. పేస్ ట్రీట్మెంట్ ఎందుకు.. ? అని ఆరాలు తీయడం మొదలుపెట్టారు.

ఇక ముందు ముఖానికి ఇప్పటి రష్మిక ముఖానికి కొద్దిగా తేడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆమె లిప్స్ దగ్గర సర్జరీ చేయించుకుందని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ఆమె పై పెదవి ఉబ్బినట్లు కనిపిస్తుంది. ఇక పెళ్ళిలో కొత్తగా కనిపించడానికి అమ్మడు రెడీ అవుతుండొచ్చు అని మరికొందరుచెప్పుకొస్తున్నారు . ఏదిఏమైనా ఇలాంటివి మంచిది కాదు.. రష్మిక నేచురల్ గానే బావుంటుంది అని అభిమానులు చెప్పుకొస్తున్నారు.

Raveena Tandon: సూర్య 46.. కెజిఎఫ్ రమికా సేన్ ను దింపిన నాగవంశీ

Mega158: చిరుతో తమిళ్ హీరో స్క్రీన్ షేరింగ్.. మల్టీస్టారర్ అని చెప్పలేదే బాబీ

Updated Date - Oct 26 , 2025 | 08:16 PM