Raveena Tandon: సూర్య 46.. కెజిఎఫ్ రమికా సేన్ ను దింపిన నాగవంశీ

ABN , Publish Date - Oct 26 , 2025 | 07:32 PM

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెల్సిందే. కంగువ (Kanguva) లాంటి భారీ పరాజయం తరువాత వచ్చిన రెట్రో (Retro) కూడా సూర్యకు విజయాన్ని అందించలేకపోయింది.

Suriya 46

Raveena Tandon: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెల్సిందే. కంగువ (Kanguva) లాంటి భారీ పరాజయం తరువాత వచ్చిన రెట్రో (Retro) కూడా సూర్యకు విజయాన్ని అందించలేకపోయింది. ఇక ఇప్పుడు సూర్య ఆశలన్నీ తన 46 వ సినిమాపైనే పెట్టుకున్నాడు. ఈమధ్యకాలంలో తమిళ్ హీరోలు.. తెలుగు డైరెక్టర్స్ తో.. తెలుగు హీరోలు.. తమిళ్ డైరెక్టర్స్ తో చేయడం ట్రెండ్ గా మారిపోయింది.

సూర్య నటిస్తున్న 46 వ చిత్రానికి తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రం సెట్స్ మీదకు కూడా వెళ్ళింది. ప్రేమలు బ్యూటీ మమితా బైజు ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుందని టాక్.

లక్కీ భాస్కర్ లాంటి భారీ విజయం తరువాత వెంకీ అట్లూరి - నాగవంశీ కాంబోలో వస్తున్న రెండో చిత్రం సూర్య 46. నాగవంశీకి కూడా ఈ మధ్య గట్టి ఎదురుదెబ్బలే తగిలాయి. ఇక దీంతో ఈ సినిమాపై నాగవంశీ గట్టి ఫోకస్ పెట్టాడు. ప్రతిదీ పక్కాగా ఉండాలని ప్లాన్ చేస్తున్నాడు. అందులో భాగంగానే బాలీవుడ్ సీనియర్ బ్యూటీ రవీనా టాండన్ ను రంగంలోకి దింపాడు. రవీనా .. సూర్య 46లో కీలక పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఒకప్పుడు బంగారు బుల్లోడు, ఆకాశ వీధిలో లాంటి సినిమాల్లో బాలయ్య, నాగార్జున లతో రొమాన్స్ చేసిన ఈ భామ ఆ తరువాత తెలుగు వైపు కన్నెత్తి చూడలేదు. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన రవీనా.. కెజిఎఫ్ 2 తో రీఎంట్రీ ఇచ్చింది. అందులో రమికా సేన్ గా ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పుడు సూర్య 46 లో కూడా అంతే పవర్ ఫుల్ క్యారెక్టర్ లో ఆమె కనిపించబోతుందని టాక్. 24 ఏళ్ళ తరువాత రవీనా టాలీవుడ్ లో మళ్లీ రీఎంట్రీ ఇస్తుంది. మరి ఈ సినిమా అమ్మడికి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Mega158: చిరుతో తమిళ్ హీరో స్క్రీన్ షేరింగ్.. మల్టీస్టారర్ అని చెప్పలేదే బాబీ

Aaryan Song: మరో మంచి మెలోడీతో వచ్చిన ఆర్యన్..

Updated Date - Oct 26 , 2025 | 07:32 PM