Mayasabha Trailer: మయసభ.. కొత్త వివాదాలకు తెరతీసేనా..
ABN, Publish Date - Aug 01 , 2025 | 03:50 PM
ఈ మధ్య కాలంలో ఓటీటీలో వచ్చే సినిమాలు ఇండస్ట్రీలో సెన్సేషన్ సృష్టిస్తూనే ఉన్నాయి.
Mayasabha Trailer: ఈ మధ్య కాలంలో ఓటీటీలో వచ్చే సినిమాలు ఇండస్ట్రీలో సెన్సేషన్ సృష్టిస్తూనే ఉన్నాయి. కథ మంచిగా ఉంటే చాలు ప్రేక్షకులు ఆ సినిమాలకు బ్రహ్మరధం పడుతున్నారు. తాజాగా మరో ఒక మంచి కథతో సోనీలివ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలను మార్చింది ఇద్దరు ప్రాణ స్నేహితులు. అయితే ఆ విషయం ఇప్పటి జనరేషన్ కు తెలియదు అంటే అతిశయోక్తి కాదు. ఎవరా ఇద్దరు అంటే.. నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అధికార, ప్రతిపక్ష పార్టీలుగా ఒకరిపై ఒకరు నోరు పారేసుకోవడం మాత్రమే అందరూ చూసారు. కానీ, అసలు వీరిద్దరి పరిచయం, స్నేహం, జీవితం ఎలా మారింది అనేది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.
ఇప్పుడు డైరెక్టర్ దేవాకట్టా.. ఆ ఇద్దరు ప్రాణస్నేహితుల కథను ప్రేక్షకులకు చూపించబోతున్నాడు. ఆది పినిశెట్టి, చైతన్య రావు ప్రధాన పాత్రలుగా దేవా కట్టా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మయసభ. సోనీలివ్ ఒరిజినల్స్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 7 నుంచి స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు అంచనాలను కూడా పీ పెంచేసింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి మధ్య విభేదాలు చిన్నపిల్లలను అడిగినా చెప్తారు. కానీ, వాటి వెనుక ఉన్న ఇద్దరు స్నేహితుల గురించి మయసభలో చూపించారు. ఒకరికి ఒకరు అండగా ఉన్నది.. ఒకరి తప్పును ఇంకొకరు ఎత్తి చూపించింది. రాజకీయ ఆటలో ఎత్తులు.. పై ఎత్తులు.. ఇలా ఒకటని కాదు.. వారిద్దరి మధ్య జరిగిన ప్రతి సంఘటనను ఇందులో చూపించారు. అయితే అందరూ చూసినట్లు కాకుండా ఎక్కడా చూడని విధంగా వీరి మధ్య స్నేహాన్నిచూపించినట్లు తెలుస్తోంది.
మయసభ రిలీజ్ అయ్యాకా కచ్చితంగా వివాదాల బాట పడుతుంది అని చెప్పొచ్చు. రెండు పార్టీల మధ్య నేతలు.. ఈ సినిమాలో ఏ చిన్న సంఘటన తప్పుగా ఉన్నా దాన్ని చిలికి చిలికి గాలివానగా మారుస్తారు. ప్రాణ స్నేహితులుగా ఉన్న వీరిద్దరూ బద్ద శత్రువులుగా ఎలా మారారు.. ? అనేది దేవాకట్టా సినిమాటిక్ గా చూపించాలి. ఎంత పేర్లు మార్చి సీన్స్ చూపించినా ఫ్యాన్స్ కచ్చితంగా కొత్త వివాదాలకు అయితే తేర లేపుతారు అనే మాటలు వినిపిస్తున్నాయి. మరి ఎన్నో ఏళ్ళ క్రితం జరిగిన ఘటనల వలన ఇప్పటి రాజకీయ నేతల భవిష్యత్తులు ప్రమాదంలో పడతాయో లేదో చూడాలి.
Radhika hospitalized: ఆ సమస్యతో ఆస్పత్రిలో.. ఇంకొన్ని రోజులు ఉండాల్సిందే. .
Bun Butter Jam: మెహర్ రమేష్ చేతుల మీదుగా.. ‘బన్ బటర్ జామ్’ టీజర్