Radhika hospitalized: ఆ సమస్యతో ఆస్పత్రిలో.. ఇంకొన్ని రోజులు ఉండాల్సిందే. .
ABN , Publish Date - Aug 01 , 2025 | 02:45 PM
సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్ ఆస్పత్రి పాలయ్యారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేరారు.
సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్ (Radhika) ఆస్పత్రి పాలయ్యారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేరారు. జ్వరంతో బాధపడుతూ ఆస్పత్రికి వెళ్లాన ఆమెకు వైద్య పరీక్షలు చేసి డెంగ్యూ సోకినట్లు వైద్యులు తెలిపారు.
ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ పూర్తిగా కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని, కొద్ది రోజులు ఆస్పత్రిలో ఉండటం మంచిదని డాక్టర్లు సూచించినట్లు కోలీవుడ్ మీడియా చెబుతోంది. ఆ వార్త తెలుసుకున్న అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ఆస్పత్రి ఉన్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ALSO READ:
Nagarjuna In Japan: నాగు సామ.. జపాన్‌లో నాగార్జున రేంజ్‌తెలిస్తే షాకే..
Coolie: కూలీ.. కథ లీక్? ఎలా అయిందంటే..
Tamil Movies: చూసేవి రెండు.. రిలీజ్ అయ్యేది పన్నెండు! తమిళ థియేటర్లలో.. సినిమాలే సినిమాలు..
Usure movie : ఉసురే మూవీ రివ్యూ