సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Samantha: సమంత సెకండ్ హ్యాండ్ కామెంట్స్.. చాలా బాధపడిందన్న డిజైనర్

ABN, Publish Date - Jun 24 , 2025 | 09:51 PM

ఇండస్ట్రీలో ఎక్కువ ఏ హీరోయిన్ ను ట్రోల్ చేశారు అంటే టక్కున సమంత (Samantha) పేరు చెప్పుకొస్తారు.

Samantha

Samantha: ఇండస్ట్రీలో ఎక్కువ ఏ హీరోయిన్ ను ట్రోల్ చేశారు అంటే టక్కున సమంత (Samantha) పేరు చెప్పుకొస్తారు. ఆమెను ట్రోల్ చేసినంతగా ఇంకెవరిని ట్రోల్ చేయలేదని చెప్పొచ్చు. స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలోనే అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక అక్కినేని ఇంటి కోడలిగా అడుగుపెట్టిన సామ్.. అందుకు తగ్గట్టుగానే గౌరవాన్ని అందుకుంది. ఎక్కడికి వెళ్లినా ఆమె కూడా ఆ మర్యాదను దక్కించుకుంది. పెళ్లి తరువాత గ్లామర్ రోల్స్ తగ్గించింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ అభిమానుల ప్రేమను చూరగొంది.


నాగ చైతన్యతో ఇప్పటికీ కలిసి ఉంటే అమ్మడికి ఇవన్నీ అలాగే ఉండేవేమో. కానీ, నాలుగేళ్లు కూడా కలిసి ఉండలేక ఇద్దరు విడాకులు తీసుకొని విడిపోయారు. అక్కడ నుంచి మొదలైంది ఆమెపై ట్రోలింగ్. నోటికి ఎంత మాట వస్తే అంత మాట సామ్ ను అనేయడం మొదలుపెట్టారు. సామ్ కావాలనే విడాకులు ఇచ్చిందని, వేరొకరితో ఎఫైర్ ఉందని, స్టైలిస్ట్ జువాల్కర్ వలనే వీరు విడిపోయారని, ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ వలన విడిపోయారని ఇలా రకరకాలుగా విమర్శలు గుప్పించారు. అంతేనా చివరికి సామ్ ను సెకండ్ హ్యాండ్ అని కూడా అనేశారు. అక్కినేని ఇంటి నుంచి బయటకు వచ్చేసిన సమంతను ఇంకెవరు పెళ్లి చేసుకుంటారు. సెకండ్ హ్యాండ్ అయ్యిపోయిందని నీచంగా మాట్లాడారు.


ఎన్ని విమర్శలు వచ్చినా.. ఎంత నీచంగా తిట్టినా సామ్ తొణకలేదు.. బెణకలేదు. ఎంతో స్ట్రాంగ్ గా నిలబడింది. మయోసైటిస్ వ్యాధిబారిన పడినప్పుడు కూడా అదంతా నాటకమని, సింపతీ కోసమని చెప్పుకొచ్చారు. అయినా పడినచోటనే లేచి నిలబడింది. కొద్దికొద్దిగా కొత్త జీవితాన్ని ప్రారంభించింది. పాత జ్ఞాపకాలను చెరిపేస్తూ వచ్చింది. ఇన్స్టాగ్రామ్ నుంచి చైతో కలిసి దిగిన ఫోటోలను డిలీట్ చేసింది. అతనితో కలిసి ఉన్న ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. పూర్తిగా చైతో ఉన్న జ్ఞాపకాలను తుడిపేయడానికి ప్రయత్నించింది. అందులో భాగంగానే ఆమె ఎంతో ముచ్చటపడి పెళ్లికి వేసుకున్న గౌన్ ను సైతం పార్టీవేర్ డ్రెస్ గా మార్చేసుకుంది.


అప్పట్లో ఈ డ్రెస్ గురించి పెద్ద పెద్ద డిబేట్ లే జరిగాయి. సామ్ డిజైనర్ క్రేషా బజాజ్ ఇచ్చిన సలహాతోనే ఇదంతా చేసిందని వార్తలు వచ్చాయి. తాజాగా క్రేషా ఒక ఇంటర్వ్యూలో అది తన ఐడియా కాదని, సామ్ ఏదైతే చెప్పిందో అదే తాను చేసానని చెప్పుకొచ్చింది. 'నాగ చైతన్యతో విడిపోయాక సమంత ఆ జ్ఞాపకాల నుంచి బయటపడాలనుకుంది. అది అంత ఈజీ అయిన విషయం కాదు. ఆ జ్ఞాపకాలను మర్చిపోవడానికి వెడ్డింగ్ గౌన్ ను కూడా వదిలించుకోవాలని ప్రయత్నించింది. కానీ, దాంతో ఉన్న ఒక ఎమోషనల్ బాండింగ్ తో ఆ గౌన్ ను నా దగ్గరకు తీసుకొచ్చి ఒక పార్టీవేర్ డిజైనర్ డ్రెస్ గా మార్చమని కోరింది.


వైట్ కలర్ వెడ్డింగ్ గౌన్ ను నేను బ్లాక్ కలర్ పార్టీవేర్ డ్రెస్ గా మార్చాను. ఇక విడాకుల తరువాత వచ్చిన విమర్శలకు తాను చాలా బాధపడుతున్నట్లు నాకు చెప్పింది. ముఖ్యంగా తనను సెకండ్ హ్యాండ్ అని పిలవడం అస్సలు నచ్చలేదని, అది ఇంకా బాధను పెంచిందని ఆమె తెలిపింది. ఆమెను ఎంతమంది అయితే సెకండ్ హ్యాండ్ అని విమర్శించారో.. వారందరికీ ఈ సెకండ్ హ్యాండ్ గౌన్ తో సమాధానం ఇచ్చింది. ఇది కేవలం సామ్ బాధ మాత్రమే కాదు విడాకులు తీసుకున్న ప్రతి మహిళ బాధ' అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Raid 2: ఆసక్తికరంగా ‘రైడ్‌ 2’ ఓటీటీ ట్రైలర్‌..స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Updated Date - Jun 24 , 2025 | 09:58 PM