Deepika Padukone: కల్కి ఎండ్ క్రెడిట్స్ నుంచి దీపికా పేరు తొలగింపు..
ABN, Publish Date - Oct 29 , 2025 | 09:27 PM
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే (Deepika Pdukone) పేరు మరోమారు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కల్కి 2 (Kalki 2) లో దీపికాను తొలగించారు అన్నప్పుడు చాలామంది వైజయంతీ మూవీస్ కు సపోర్ట్ గా నిలిచారు.
Deepika Padukone: బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే (Deepika Pdukone) పేరు మరోమారు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కల్కి 2 (Kalki 2) లో దీపికాను తొలగించారు అన్నప్పుడు చాలామంది వైజయంతీ మూవీస్ కు సపోర్ట్ గా నిలిచారు. స్పిరిట్ సినిమా కోసం దీపికా పెట్టిన కండీషన్స్ వింటే.. ఎవరైనా ఇలాగే చేస్తారు అంటూ చెప్పుకొచ్చారు. ఇక మరికొంతమంది దీపికాకు సపోర్ట్ గా నిలబడ్డారు. ఆమె లేనిదే కల్కి సినిమా లేదని, కల్కి 2 నుంచి, స్పిరిట్ నుంచి తొలగిస్తే దీపికకు ఒరిగేది ఏమి లేదని చెప్పుకొచ్చారు. కొన్నిరోజులు సోషల్ మీడియాను షేక్ చేసిన ఈ వార్త నెమ్మది నెమ్మదిగా మరుగున పడింది.
ఇక తాజాగా కల్కి 2898 AD సినిమా మరోసారి వైరల్ గా మారింది. అందుకు కారణం ఈ సినిమా ఎండ్ క్రెడిట్స్ లో దీపికా పేరు లేకపోవడమే. దీంతో వైజయంతీ మూవీస్.. దీపికాకు కనీసం క్రెడిట్స్ కూడా ఇవ్వకుండా అన్యాయం చేసిందని సోషల్ మీడియాలో నెటిజన్స్ మండిపడుతున్నారు. కల్కి ఓటీటీ చూస్తూ ఒక నెటిజన్.. ఎండ్ క్రెడిట్స్ లో దీపికా పేరును మిస్ అవ్వడం చూసి సోషల్ మీడియాలో దీపికాకు సపోర్ట్ గా పోస్ట్ పెట్టుకొచ్చాడు. మొదటి పార్ట్ లో ఆమె నటన బావుంది. అంతా బావున్నప్పుడు ఉంచి.. ఇలా వివాదాలు వచ్చినప్పుడు తీసేసేస్తారా.. వరస్ట్ ప్రొడక్షన్ హౌస్ అంటూ మండిపడ్డాడు. ఆ తరువాత ఒక్కొక్కరిగా దీపికాకు సపోర్ట్ చేస్తూ ఈ విషయాన్నీ వైరల్ చేశారు.
ఇక అందుతున్న సమాచారం ప్రకారం.. వైజయంతీ మూవీస్.. దీపికా పేరును ఎండ్ కార్డ్స్ నుంచి కావాలని తొలగించలేదని, కొన్ని గ్లిచ్స్ వలన పేరు కనపడకుండా పోయిందని, కేవలం హిందీ వెర్షన్ లోనే అలా వస్తుందని.. తెలుగులో దీపికా పేరు ఉందని పలువురు చెప్పుకొస్తున్నారు. ఏదిఏమైనా మరోసారి దీపికా.. కల్కి విషయంలో హైలైట్ గా మారింది. మరి ఈ విషయమై వైజయంతీ మూవీస్ మేకర్స్ ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.
Raashii Khanna: అందాల రాశీ.. హగ్ చేసుకున్నది ఎవరినో
Bahubali The Epic: అయ్యయ్యో.. బంగారం లాంటి పాటలన్నింటిని లేపేశారంటనే