Raashii Khanna: అందాల రాశీ.. హగ్ చేసుకున్నది ఎవరినో
ABN , Publish Date - Oct 29 , 2025 | 07:49 PM
: అందాల హాట్ బ్యూటీ రాశీ ఖన్నా (Raashii Khanna) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Raashii Khanna: అందాల హాట్ బ్యూటీ రాశీ ఖన్నా (Raashii Khanna) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొని కుర్ర కారు గుండెల్లో తిష్టవేసుకొని కూర్చోంది. చాలాకాలాం నుంచి రాశీ స్టార్ హీరోయిన్ రేసులో పరిగెడుతుంది కానీ.. అంత హిట్ ను మాత్రం అందుకోలేకపోతుంది.
ఇక ఈ మధ్య వచ్చిన తెలుసు కదా కూడా రాశీకి పరాజయాన్నే అందించింది. ప్రస్తుతం అమ్మడు పలు కథలు వింటుందని టాక్. ఇక సినిమాలు లేకపోయినా.. హిట్ రాకపోయినా కూడా రాశీ అంటే తెలుగువారికి అమితమైనఅభిమానం. సింగర్ గా కూడా రాశీ సుపరిచితమే.
ఇదంతా పక్కన పెడితే.. తాజాగా రాశీ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక ఫోటోను షేర్ చేసింది. ఎవరో ఒక అబ్బాయిని హగ్ చేసుకుంటూ ఉన్న ఫోటోను షేర్ చేస్తూ కౌగిలింతలో ప్రపంచం మృదువుగా అనిపిస్తుంది అంటూ అందమైన క్యాప్షన్ కూడా ఇచ్చింది. అయితే ఆ వ్యక్తి ఎవరుఅన్నది మాత్రం అమ్మడు రివీల్ చేయలేదు. దీంతో ఆ మిస్టరీ మ్యాన్.. రాశీ బాయ్ ఫ్రెండ్ అంటూ సోషల్ మీడియాలో పుకార్లు మొదలయ్యాయి. ఇప్పటివరకు ఈ చిన్నది ఇలాంటి ఒక స్టోరీ ఎప్పుడుపెట్టింది లేదు. దీంతో ఆ పుకార్లు నిజమే అయ్యి ఉంటాయని నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. మరి అందాలా రాశీని అంత గట్టిగా హత్తుకున్న కుర్రాడు ఎవరో తెలియాలంటే అమ్మడు పెదవి విప్పాల్సిందే.
Bahubali The Epic: అయ్యయ్యో.. బంగారం లాంటి పాటలన్నింటిని లేపేశారంటనే
Brahmanandam: హాస్య బ్రహ్మకు సూర్యకాంతం స్మారక పురస్కారం