సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Tollywood: క్రిస్మస్ బరిలో 'ఛాంపియన్'

ABN, Publish Date - Oct 06 , 2025 | 04:45 PM

క్రిస్మస్ పండగ బరిలో నిలవబోతున్నాడు రోషన్ మేకా. అతను హీరోగా నటించిన పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా 'ఛాంపియన్' డిసెంబర్ 25న రాబోతోంది.

Dacoit Vs Champion

సీనియర్ నటుడు శ్రీకాంత్ (Srikanth) తనయుడు, యంగ్ హీరో రోషన్ (Roshan) నటిస్తున్న సినిమా 'ఛాంపియన్' (Champion). అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో రూపుదిద్దుకున్న 'నిర్మల కాన్వెంట్'లో రోషన్ టెండర్ ఏజ్ లోనే హీరోగా నటించాడు. ఆ తర్వాత కె. రాఘవేంద్రరావు (K. Raghavendra Rao) దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన 'పెళ్ళిసందడి' (Pelli Sandadi) లో హీరోగా చేశాడు. కానీ ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా విజయాన్ని అందుకోలేకపోయాయి. దాంతో రోషన్ ఇప్పుడు తన ఆశలన్నీ 'ఛాంపియన్' మూవీ మీదనే పెట్టుకున్నాడు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో ఈ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాను జీ స్టూడియోస్ తో కలిసి స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాతో మలయాళీ నటి అనస్వర రాజన్ తెలుగు తెరకు పరిచయం అవుతోంది. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ను సోమవారం మేకర్స్ లాక్ చేశారు. డిసెంబర్ 25న, క్రిస్మస్ కానుకగా ఈ సినిమా జనం ముందుకు వస్తుందని చెప్పారు.


అయితే... ఇప్పటికే డిసెంబర్ 25వ తేదీ అడివి శేష్‌ (Adivi Sesh) హీరోగా నటించిన 'డకాయిట్' (Dacoit) మూవీ రిలీజ్ కాబోతున్నట్టు ప్రకటన వచ్చింది. ఈ ఇంటెన్స్ యాక్షన్, స్టైలిష్ మూవీని షానియల్ డియో (Shaneil Deo) తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రానికి సుప్రియ యార్లగడ్డ (Supriya Yarlagadda) నిర్మాత కాగా, అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సునీల్ నారంగ్ సహ నిర్మాతగా రూపొందిస్తున్నారు. ఇది క్రిస్మస్ రోజున తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇందులో మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakur) ఓ స్ట్రాంగ్ క్యారెక్టర్ చేస్తోంది. అలానే బాలీవుడ్ దర్శక నిర్మాత అనురాగ్ కశ్యప్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.

Also Read: Vijay Deverakonda : విజయ్ చేతికి ఉంగరం

Also Read: Tuesday Tv Movies: మంగ‌ళ‌వారం, Oct 07.. తెలుగు టీవీ మాధ్య‌మాల్లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

Updated Date - Oct 06 , 2025 | 04:47 PM