Vijay Deverakonda: చేతికి ఉంగ‌రం.. మొత్తానికి విజ‌య్ దేవరకొండ దొరికి పోయాడుగా

ABN , Publish Date - Oct 06 , 2025 | 04:27 PM

సినిమాల కంటే సోషల్ మీడియా స్టార్ గా మారిపోయాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. మూవీ మ్యాటర్స్ కన్నా నిత్యం ఏదో ఓ వార్తతో హెడ్ లైన్స్ లో నిలుస్తున్నాడు. తాజాగా తన కో-స్టార్ ర‌ష్మిక‌తో సైలెంట్ గా ఎంగేజ్ మెంట్ జరిపేసుకుని మరోసారి వార్తల్లోకెక్కాడు.

Vijay Deverakonda, Rashmika

విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) యూత్ ఐకాన్. సినిమాలతోనే కాదు తన మాటలతో ఎంతో మంది ఫాలోవర్స్ ను క్రియేట్ చేసుకున్నాడు. తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ను ఏర్పాటు చేసుకున్నాడు. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. అలాంటి హీరో తాజాగా ఓ ఇంటివాడు కాబోతున్నాడన్న న్యూస్ హాట్ టాపిక్ గా మారితే... ఆ మాటలకు మరింత బలాన్నిచ్చే ఓ న్యూస్ బయటకు వచ్చింది.


ప్రేమ, పెళ్లి మ్యాటర్ తో మరోసారి వార్తల్లోకెక్కాడు విజయ్ దేవరకొండ. గత కొంత కాలంగా ర‌ష్మిక‌ (Rashmika ) , విజయ్ దేవరకొండ డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు హల్ చల్ చేశాయి. ఇద్దరూ ఒకే చోట కనిపించడం, వెకేషన్స్ కు కలిసే వెళ్ళడం.. జంటగా కెమెరాలకు చిక్కడం చాలా చాలా కామన్ అయిపోయింది. దాంతో పైకి చెప్పకపోయినా వీరి మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ ఉందంటూ బోలెడు కథనాలు వచ్చాయి. పైగా విజయ్ ఇంట్లో ఏ చిన్న ఈ ఫంక్షన్స్ అక్కడ ప్రత్యక్షమైపోతోంది 'శ్రీవల్లి'. దీంతో విజయ్, ర‌ష్మిక‌ త్వరలో పెళ్లి చేసుకుంటారంటూ వార్తలు వినిపించాయి.

అయితే ఈ విషయంపై క్లారిటీ ఇవ్వకపోవడంతో పాటు జస్ట్ ఫ్రెండ్స్ అంటూ కలరింగ్ ఇస్తూ వచ్చారు. కట్ చేస్తే ఈ ఇద్దరూ అక్టోబర్ 3న ఎంగేజ్ మెంట్ చేసుకున్నట్లు స్పష్టమైంది. ఇప్పటికీ ఆ విషయాన్ని ఇద్దరిలో ఎవరూ అధికారికంగా ప్రకటించలేదు. అయితే తాజాగా విజయ్ ఆ విషయాన్ని చెప్పకనే చెప్పినట్లు తెలుస్తోంది.

రీసెంట్ గా పుట్టపర్తి సాయిబాబా సమాధిని దర్శించుకున్నారు విజయ్. దీంతో ప్రశాంతి నిలయం ట్రస్ట్ సభ్యులు విజయ్ కు గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోల్లో విజయ్ చేతికి ఉంగరం కనిపించడంతో విజయ్ ఎంగేజ్ మెంట్ రింగ్ ఇదే అంటూ ప్రచారం మొదలైంది. ప్రస్తుతం ర‌ష్మిక‌ నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంది. అంత బిజీలోనూ విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేయడానికి ఆమె కమిట్ అయ్యింది. అయితే... ఇద్దరి సినిమాల షెడ్యూల్స్ ఒక కొలిక్కి వచ్చిన తర్వాత ఫిబ్రవరిలో వీరు పెళ్ళి పీటలు ఎక్కుతారని తెలుస్తోంది.

Read Also: Mahesh Babu: బాబు డెడికేషన్‌ అలా ఉంటాది మరి..

Read Also:Tron: Ares: సరైన సమయంలో 'ట్రాన్ ఆరెస్'

Updated Date - Oct 06 , 2025 | 05:48 PM