Tollywood: సినీ దర్శకనిర్మాతలతో సీఎం భేటీ.. ఏమన్నారంటే

ABN , Publish Date - Aug 24 , 2025 | 09:46 PM

టాలీవుడ్ సినీ దర్శకనిర్మాతలు తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

Tollywood

Tollywood: టాలీవుడ్ సినీ దర్శకనిర్మాతలు తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వారందరిని సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా ఆహ్వానించి వారి సమస్యలను సహనంగా విన్నారు. ఇండస్ట్రీలో గత కొన్నిరోజులుగా జరుగుతున్న అన్ని పరిణామాల గురించి వారు సీఎం రేవంత్ రెడ్డి ముందు పెట్టడం జరిగింది. ఇక భేటీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ' సినిమా పరిశ్రమలో చక్కటి పని వాతావరణం ఉండాలి. సినిమా కార్మికులను కూడా నేను పిలిచి మాట్లాడుతాను. ప్రభుత్వం నుంచి సినిమా పరిశ్రమకు ఎల్లప్పుడూ పూర్తి సహకారం ఉంటుంది. పరిశ్రమలోకి కొత్తగా వచ్చే వారికి నైపుణ్యాలు పెంచేలా చర్యలు తీసుకోవాలి. పరిశ్రమలో వివిధ అంశాల్లో నైపుణ్యాల పెంపు కోసం ఒక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందనుకుంటున్నాను. స్కిల్ యూనివర్సిటీ లో సినిమా పరిశ్రమ కోసం కావాల్సిన ఏర్పాట్లు చేస్తాం.

WhatsApp Image 2025-08-24 at 9.32.47 PM.jpeg


తెలుగు సినిమా పరిశ్రమ అంతర్జాతీయ స్థాయికి వెళ్లింది. తెలంగాణలో ముఖ్యమైన పరిశ్రమ సినిమా పరిశ్రమ. అలాంటి పరిశ్రమలో వివాదం వద్దనే కార్మికుల సమ్మె విరమణకు చొరవ చూపించాను. పరిశ్రమలో నిర్మాతలు, కార్మికుల విభాగంలో సంస్కరణలు ఎంతో అవసరం. కార్మికుల విషయంలో నిర్మాతలు మానవత్వంతో వ్యవహరించాలి. నిర్మాతలు, కార్మికులు, ప్రభుత్వం కలిసి ఒక పాలసీ తీసుకువస్తే బాగుంటుంది. సినీ కార్మికులను, నిర్మాతలను కూడా మా ప్రభుత్వం కాపాడుకుంటుంది. సినిమా పరిశ్రమకు మానిటరింగ్ అవసరం. పరిశ్రమకు ఏం కావాలో ఒక కొత్త పుస్తకాన్ని రాసుకుందాం. పరిశ్రమలో వ్యవస్థలను నియంత్రిస్తామంటే ప్రభుత్వం సహించదు. అందరూ చట్టపరిధిలో పని చేయాల్సిందే..పరిశ్రమ విషయంలో నేను న్యూట్రల్ గా ఉంటాను.

WhatsApp Image 2025-08-24 at 9.32.48 PM.jpeg


హైదరాబాద్ లో అంతర్జాతీయ సినిమాల చిత్రీకరణ కూడా జరుగుతోంది..తెలుగు సినిమాల చిత్రీకరణ ఎక్కువగా రాష్ట్రంలోనే జరిగేలా చూడాలి. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా పరిశ్రమను ఉంచడమే నా ధ్యేయం' అని చెప్పుకొచ్చారు. ఈ భేటీలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు (Dil Raju), నిర్మాతలు అల్లు అరవింద్ (Allu Aravind), డి.సురేష్ బాబు, జెమిని కిరణ్, స్రవంతి రవికిశోర్, నవీన్ ఎర్నేని, వంశీ, బాపినీడు, డివివి దానయ్య, గోపి, చెరుకూరి సుధాకర్, సాహు, అభిషేక్ అగర్వాల్,విశ్వ ప్రసాద్, అనిల్ సుంకర, శరత్ మరార్, ఎన్వీ ప్రసాద్, ఎస్కేన్, రాధామోహన్, దాము, దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్,,బోయపాటి శ్రీనివాస్,,సందీప్ రెడ్డి వంగా,వంశీ పైడిపల్లి,అనిల్ రావిపూడి,వెంకీ కుడుముల పాల్గొన్నారు.ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Chiranjeevi: చిరు గొప్ప మనసు.. సీఎం రిలీఫ్ ఫండ్‌కి కోటి విరాళం

Brahmaji: 30 ఇయర్స్ ఇండస్ట్రీ.. అబ్బబ్బా కన్నుల పండుగగా ఉందే

Updated Date - Aug 24 , 2025 | 09:50 PM