Megastar Chiranjeevi: జోరు పెంచిన చిరు.. ఏకంగా నాలుగు సినిమాలు
ABN, Publish Date - Dec 17 , 2025 | 04:04 PM
ఈ యేడాది ఆగస్టు 22తో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) 70 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. గత రెండేళ్ళుగా చిరంజీవి నటించిన ఏ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు.
Megastar Chiranjeevi: ఈ యేడాది ఆగస్టు 22తో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) 70 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. గత రెండేళ్ళుగా చిరంజీవి నటించిన ఏ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. అయితే రాబోయే 2026లో మాత్రం చిరంజీవి నటించిన రెండు చిత్రాలు విడుదల కానున్నాయి. వాటిలో ముందుగా జనవరి 12న 'మన శంకర వరప్రసాద్ గారు (Mana Shankara Varaprasad) ' రానుంది. ఇక రెండేళ్ళ నుంచీ రూపొందుతోన్న 'విశ్వంభర (Vishwambhara)'ను కూడా వచ్చే యేడాది రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు కాకుండా మరో రెండు చిత్రాలలో చిరంజీవి నటిస్తున్నారు.
'భోళాశంకర్' తరువాత 'విశ్వంభర' చిత్రంలో నటించారు చిరంజీవి. ఆ మూవీ ఈ యేడాది సంక్రాంతికే రిలీజ్ కావలసింది. అయితే కథానుగుణంగా 'విశ్వంభర'లో వీఎఫ్ఎక్స్ వర్క్ చాలా ఉంది. అందువల్ల సరైన సమయం తీసుకొని దానిని చక్కగా రావడానికి చెక్కుతున్నారు. ఈ సమయంలోనే అనిల్ రావిపూడి మెగాస్టార్ కు తగ్గ కథను వినిపించడంతో 'మన శంకరవరప్రసాద్ గారు'కు ఓకే చెప్పేశారు. ఇది ఫక్తు ఎంటర్ టైన్ మెంట్ మూవీ కావడం వల్ల ఎలాంటి టెక్నికల్ ఎక్స్ పెరిమెంట్స్ లేవు. సరదాగా సాగే కథతో రూపొంది ఆడియెన్స్ కు ఆనందం పంచేలా రూపొందుతోంది. చిరంజీవి ఉత్సాహానికి తగ్గట్టుగా 'మన శంకరవరప్రసాద్ గారు' పాటలు విశేషాదరణ చూరగొంటున్నాయి... రెండు పాటలు కలిపి వంద మిలియన్ వ్యూస్ సాధించి, మరింత ముందుకు దూసుకుపోతున్నాయి.
ఇక ఈ రెండు సినిమాలు కాకుండా చిరు తనకు 'వాల్తేరు వీరయ్య' లాంటి బంపర్ హిట్ ను అందించిన బాబీ డైరెక్షన్ లో మరో సినిమాను ఓకే చేసేశారు. ఈ మూవీని 2027 సంక్రాంతికి రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఈ చిత్రంతో పాటు శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లోనూ చిరంజీవి నటించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నాని హీరోగా రూపొందుతోన్న 'ద ప్యారడైజ్' మూవీని రూపొందించడంలో బిజీగా ఉన్నారు శ్రీకాంత్ ఓదెల. ఆ మూవీ కాగానే చిరంజీవితో ఈ యేడాదే సినిమా ఆరంభం కానుంది. ఈ మూవీ కూడా 2027లోనే జనం ముందుకు వస్తోంది. ఇలా ఓ ప్లానింగ్ ప్రకారం రెండు చిత్రాలు రిలీజ్ చేస్తూ, మరో రెండు సినిమాలతో సాగుతున్నారు చిరంజీవి... ఇదే పంథాను మునుముందు కూడా కొనసాగిస్తారేమో చూడాలి.