Power Star: తమ్ముడు పవన్ కు చిరు శుభాకాంక్షలు...
ABN, Publish Date - Sep 02 , 2025 | 09:07 AM
మెగాస్టార్ చిరంజీవి... తన తమ్ముడు, ఎ.పి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
సెప్టెంబర్ 2... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు, సినిమా రంగానికి చెందిన వ్యక్తులు, రాజకీయ పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి సైతం తమ్ముడు పవన్ కళ్యాణ్ కు తన శుభాకాంక్షలు తెలియచేశారు. 'చలన చిత్ర రంగంలో అగ్రనటుడిగా, ప్రజా జీవితంలో జనసేనానిగా, ఏపీ డిప్యూటీ సీఎం గా ప్రజలకు నిరంతర సేవలు అందిస్తున్న కళ్యాణ్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు. ప్రజాసేవలో నువ్వు చూపుతున్న అంకిత భావం చిరస్మరణీయం. ప్రజలందరి ఆశీస్సులతో నిండు నూరేళ్ళు ఆయురారోగ్యలతో ప్రజలకు మార్గదర్శకుడిగా నిలవాలని ఆశీర్వదిస్తున్నాను. దీర్ఘాయుష్మాన్ భవ' అని తమ్ముడు పవన్ తో ఉన్న ఫోటోను చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మెగాభిమానులు ఈ పోస్ట్ ను వైరల్ చేస్తున్నారు.
Also Read: Tuesday Tv Movies: మంగళవారం, సెప్టెంబర్ 02.. తెలుగు టీవీ మాధ్యమాల్లో ప్రసారమయ్యే సినిమాలివే