Chiranjeevi: చరిత్రలో చిరస్థాయిగా.. మా గుండెల్లో చిరుస్థాయిగా ..
ABN, Publish Date - Aug 22 , 2025 | 01:23 PM
ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా సినిమా పరిశ్రమలో అడుగుపెట్టి స్వయంకృషితో ఉన్నత శిఖరాలను అధిరోహించారు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi). నటుడిగానే కాకుండా సేవ కార్యక్రమాలతో ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకున్నారు.
ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా సినిమా పరిశ్రమలో అడుగుపెట్టి స్వయంకృషితో ఉన్నత శిఖరాలను అధిరోహించారు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi). నటుడిగానే కాకుండా సేవ కార్యక్రమాలతో ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకున్నారు. శుక్రవారం ఆయన 70వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దీంతో ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అగ్ర కథనాయకులు, అభిమానులు, రాజకీయ నాయకులూ ఆయనకు శుభాకాంక్షలు చెప్పి తమకున్న అనుబంధాన్ని పంచుకుంటున్నారు. ‘హ్యాపీ బర్త్‌డే.. వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు’ అంటూ అల్లు అర్జున్ (allu arjun) శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో కలిసి డ్యాన్స్ చేస్తోన్న ఫొటో సోషల్ను మీడియాలో షేర్ చేశారు.
'పుట్టినరోజు శుభాకాంక్షలు డియర్ చిరంజీవి. ఎప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో చేసుకోవాలని కోరుకుంటున్నాను’ అంటూ వెంకటేష్ ట్వీట్ చేశారు.
'చరిత్రలో చిరస్థాయిగా.. మా గుండెల్లో చిరుస్థాయిగా. లవ్‌యూ బాస్. హ్యాపీ బర్త్‌డే’ - హరీశ్ శంకర్
'భారతీయ సినిమాకు గర్వకారణం, మిలియన్ల మంది హృదయస్పందన మా అన్నయ్య మెగాస్టార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు'
- దర్శకుడు బాబీ కొల్లి
'తనను తాను శిల్పంగా మలచుకొని కొన్ని తరాల్లో స్ఫూర్తినింపిన పద్మవిభూషణ్ చిరంజీవికి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు’
- వంశీ పైడిపల్లి
మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు. విశ్వంభర గ్లింప్స్, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి’
- నారా రోహిత్
‘సెన్సేషన్‌కు 70 ఏళ్లు.. కాలం గడుస్తున్నకొద్దీ మీపై ప్రేమ ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది. నాలాంటి మిలియన్ల మందిలో స్ఫూర్తి నింపినందుకు కృతజ్ఞతలు సర్’ -
-తేజ సజ్జా
‘ఇండియన్ సినిమా గాడ్ ఫాదర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ సినీ ప్రయాణం ఎంతోమందికి ఆదర్శం. మీ ఎనర్జీ ఓ అద్భుతం. మీ తదుపరి సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా'
- మంచు మనోజ్
'నేను చూసిన మొదటి హీరో మా మామయ్య. ఆయన జీవితం నాకు ఆదర్శం. మామ చేతి నడకే ఈ రోజు నా పయనం. ఆయన నేర్పిన నడవడికే ఓ జీవిత పాఠం. మామయ్యే నా సర్వస్వం. కష్టమైనా, సుఖమైనా.. ఆయన తోడుంటే అదే కొండంత ధైర్యం. మామయ్య మాటే నాకు శాసనం. ఎప్పటికీ ఆయనే నా బలం. మీ మెగాస్టార్.. మన మెగాస్టార్.. నా ముద్దుల మామయ్య చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు’
- సాయి దుర్గా తేజ్