సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Businessman: బిజినెస్‌మేన్‌ రీరిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

ABN, Publish Date - Nov 08 , 2025 | 03:33 PM

‘నేను మెల్లగా ఎలాగోలా బతికేయడానికి ముంబై రాలేదు.. ముంబైని.. పోయించడానికి వచ్చాను.. ఈ డైలాగ్‌లు థియేటర్స్‌లో దద్దరిల్లి 13 ఏళ్లు అవుతోంది.

‘నేను మెల్లగా ఎలాగోలా బతికేయడానికి ముంబై రాలేదు..

ముంబైని.. పోయించడానికి వచ్చాను..

ఈ డైలాగ్‌లు థియేటర్స్‌లో దద్దరిల్లి 13 ఏళ్లు అవుతోంది. ఇప్పుడు మరోసారి సందడి చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సూర్యాభాయ్‌గా మహేశ్‌ బాబు (Mahesh Babu) మెప్పించిన చిత్రం ‘బిజినెస్‌మెన్‌’ 9Businessman Rerelease). డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో ఆర్‌ఆర్‌ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రం 2012 సంక్రాంతికి విడుదలై సెన్సేషనల్‌ హిట్‌ అయింది. రీ రిలీజ్‌ల ట్రెండ్‌ నడుస్తున్న నేపథ్యంలో ఈ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.

నవంబర్‌ 29న సూర్య భాయ్‌గా మహేశ్‌ థియేటర్లలో మహేశ్‌ సందడి చేయనున్నారు. తాజాగా దీనికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. మెగా ప్రొడక్షన్స్‌ డిస్ర్టిబ్యూషన్‌ ద్వారా ‘బిజినెస్‌మ్యాన్‌’ దేశవ్యాప్తంగా రీ-రిలీజ్‌ కానుంది. మహేష్‌ బాబు బాల నటుడిగా నటించిన మొదటి చిత్రం నీడ (1979) నవంబర్‌ 29తేదీనే విడుదలైంది. ఇప్పుడు బిజినెస్‌మ్యాన్‌ సినిమాను అదే రోజున రీ-రిలీజ్‌ చేస్తున్నాం అని మెగా ప్రొడక్షన్స్‌ సంస్థ తెలిపింది.

Updated Date - Nov 08 , 2025 | 03:33 PM