Peddi: బుచ్చిబాబు సర్ప్రైజ్.. థియేటర్లు దద్దరిల్లిపోవల్సిందే!

ABN , Publish Date - Aug 02 , 2025 | 04:50 PM

గ్లోబల్‌స్టార్‌ రామ్‌ చరణ్‌, జాన్వీ కపూర్‌ జంటగా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా కోసం దర్శకుడు ఒక సర్‌ప్రైజ్‌ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు

గ్లోబల్‌స్టార్‌ రామ్‌ చరణ్‌(Ram charan), జాన్వీ కపూర్‌ (janhvey kapoor) జంటగా దర్శకుడు బుచ్చిబాబు సానా (Buchibabu sana) తెరకెక్కిస్తున్న చిత్రం ‘పెద్ది’. ఉత్తరాంధ్ర నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది.  ఈ సినిమా ప్రారంభం నుంచి అంచనాలు బాగానే ఉన్నాయి. ఫస్ట్‌ గ్లింప్స్‌ విడుదల తర్వాత మరింత క్రేజ్‌ పెరిగింది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఉప్పెన భారీ విజయం తర్వాత అంతకు మించి ఈ చిత్రం ఉండాలని రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. ఈ సినిమాతో సాలిడ్‌ సర్‌ప్రైజ్‌ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు బుచ్చిబాబు. సుకుమార్ తెరెకెక్కించిన  ‘రంగస్థలం’ సినిమాలో పూజాహెగ్డే జిగేల్‌ రాణిగా మెరిసి మెప్పించింది. ఇప్పుడు ఇదే రీతిలో శ్రీకాకుళంకి చెందిన ఓ ఫేమస్‌ ఫోక్‌ సాంగ్‌ను ఈ సినిమాలో రీమిక్స్‌ చేస్తునట్లు తెలుస్తోంది.

ALSO READ: National Awards: ప్రతిభావంతులకు అన్యాయంపై విమర్శ


ప్రస్తుతం ఈ సినిమా గురించి వైరల్‌ అవుతున్న ప్రకారం శ్రీకాకుళం జానపద గేయం మా ఊరి ప్రెసిడెంటు అనే సాంగ్‌ని మేకర్స్‌ రీమిక్స్‌ చేయగా ఈ పాటను ప్రముఖ జానపద గేయ రచయిత పెంచల్‌ దాస్‌  ఫేమ్‌ ఆలపించినట్టుగా తెలుస్తుంది. మరీ ఫోక్‌ సాంగ్‌కి రెహమాన్‌ మ్యూజిక్‌ టచ్‌ ఇస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. రంగస్థలం తరహాలో థియేటర్‌ దద్దరిల్లే పాట రాబోతుందని  అర్థమవుతోంది. 

ALSO READ: Manam - Japan: నాగార్జున క్రేజ్‌  మామూలుగా లేదుగా.  ‘నాగ్‌ సామ’ అంటే అర్థం తెలుసా 

OG Firestorm: ఓజీ ఫైర్‌ స్ట్రామ్‌ గంభీర.. లిరికల్‌ వీడియో వచ్చేసింది



Updated Date - Aug 02 , 2025 | 05:05 PM