Manam - Japan: నాగార్జున క్రేజ్‌  మామూలుగా లేదుగా.  ‘నాగ్‌ సామ’ అంటే అర్థం తెలుసా 

ABN , Publish Date - Aug 02 , 2025 | 03:56 PM

భారతీయ చిత్రాలు విదేశాల్లో విపరీతమైన క్రేజ్‌ పెరుగుతోంది. ఓవర్సీస్‌ అంటే అమెరికా వంటి ప్రాంతాల్లోనే కాకుండా జపాన్‌, జర్మనీ ప్రాంతాల్లోనూ తెలుగు సినిమాలకు ఆదరణ బాగా పెరుగుతోంది

భారతీయ చిత్రాలు విదేశాల్లో విపరీతమైన క్రేజ్‌ పెరుగుతోంది. ఓవర్సీస్‌ అంటే అమెరికా వంటి ప్రాంతాల్లోనే కాకుండా జపాన్‌(Manam in japan)), జర్మనీ ప్రాంతాల్లోనూ తెలుగు సినిమాలకు ఆదరణ బాగా పెరుగుతోంది. అక్కడ కూడా ఫ్యాన్‌ బేస్‌ మొదలైంది. అందుకు చాలా సినిమాలే ఉదాహరణ. జపాన్‌లో సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌కు మంచి ఫాలోయింగ్‌ ఉంది. ‘ముత్తు’ విడుదల తర్వాత ఆయనకు క్రేజ్‌ వచ్చింది. ‘బాహుబలి’తో ప్రభాస్‌కు, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో రామ్‌చరణ్‌, తారక్‌లకు ఫ్యాన్స్‌ పుట్టుకొచ్చారు.  ‘దేవర’ సినిమా తర్వాత ఎన్టీఆర్‌కు అక్కడ మరింత ఫాలోయింగ్‌ పెరిగింది. అయితే కింగ్‌ అక్కినేని నాగార్జునకు జపాన్‌ దేశంలో ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ మరో లెవల్‌లో ఉంది.  దానికి ‘మనం’ సినిమా రీ రిలీజ్‌ ఒక ఉదాహరణగా చెప్పవచ్చు.  (Nagarjuna)

ఇప్పుడు టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్‌ బాగా నడుస్తోంది. అభిమానులు ఆ చిత్రాలకు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే ‘మనం’ మూవీ రీ రిలీజ్‌ అవుతోంది. అయితే ఇక్కడ కాదు. ఆగస్టు 8న రీ రిలీజ్‌ చేస్తున్నారు. బాలీవుడ్‌ సినిమా ‘బ్రహ్మాస్త్ర’ విడుదల తర్వాత, అందులో నాగార్జున నటన చూసి జపనీస్‌ ఫిదా అయ్యారు. రీసెంట్‌గా నాగ్‌ కీలక పాత్ర పోషించిన ‘కుబేర’ ఓటీటీ రిలీజ్‌ తర్వాత జపాన్‌లో ట్రెండింగ్‌ అయింది. అక్కడ నాగార్జునకు ఉన్న క్రేజ్‌ చూసి ‘మనం’ సినిమాను జపాన్‌లో రీ రిలీజ్‌ చేస్తున్నారు. నాగార్జునను జపాన్‌ ఫ్యాన్స్‌ ‘నాగ్‌ సామ’ అంటున్నారు. ‘సామ’ అంటే మర్యాద ఇవ్వడం. దేవుళ్లను, రాజులను, లెజెండరీ పర్సనాలిటీలను జపాన్‌ జనాలు అలా పిలుస్తారు.  అంటే నాగార్జునను ఆ స్థాయిలో రెస్పెక్ట్‌ ఇస్తున్నారు. ‘మనం’ రీ రిలీజ్‌ సందర్భంగా తనపై ఇంత ప్రేమ, ఆదరణ చూపిస్తున్న జపాన్‌ అభిమానులతో నాగార్జున సమావేశం కానున్నారు. అయితే అది నేరుగా కాదు, వర్చువల్‌ మీట్‌లో ఫ్యాన్స్‌తో మాట్లాడబోతున్నారు.  

 

Updated Date - Aug 02 , 2025 | 04:15 PM