Mega 158: మొన్న కార్తీ.. నేడు అనురాగ్.. ఏం ప్లాన్ చేస్తున్నావ్ బాబీ
ABN, Publish Date - Oct 28 , 2025 | 01:55 PM
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇప్పటికే రెండు సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఇక ఇవి కాకుండా చిరు నటిస్తున్న మరో చిత్రం మెగా 158 (Mega 158).
Mega 158: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇప్పటికే రెండు సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. ఇక ఇవి కాకుండా చిరు నటిస్తున్న మరో చిత్రం మెగా 158 (Mega 158). బాబీ కొల్లి (Bobby Kolli) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈ కాంబోలో వాల్తేరు వీరయ్య సినిమా వహ్హ్య్ మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు రెండోసారి కలవబోతున్నారు అనేసరికి అంచనాలు మరింత పెరిగాయి.
వాల్తేరు వీరయ్యకంటే ఈసారి బాబీ.. చిరును ఇంకా హై రేంజ్ లో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. అంచనాలకు తగ్గట్లే నటీనటులను కూడా ఆ రేంజ్ లోనే తీసుకుంటున్నాడు. ఇప్పటికే ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. ఈ సినిమాలో ఒక కుర్ర హీరోకు కీలక పాత్ర ఉందని, దానికి కార్తీ అయితే బావుంటాడు అని ఆయనను సెలెక్ట్ చేశారట. ఇక ఇదే పెద్ద షాకింగ్ అంటే.. దీనికి మించి ఇంకో వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.
మెగా 158 లో బాలీవుడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ అనురాగ్ కశ్యప్ విలన్ గా నటిస్తున్నాడని సమాచారం, గత కొన్నేళ్లుగా అనురాగ్ నటన మీదనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నాడు. మహారాజ సినిమాలో ఆయన విలనిజానికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమా తరువాత అన్ని భాషల్లో వరుస అవాకాశాలను అందుకుంటూ వస్తున్నాడు. ఇప్పటికే తెలుగులో డెకాయిట్ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. ఇక ఇప్పుడు ఏకంగా చిరుకు ధీటైన విలన్ గా మెగా 158 లోకి అడుగుపెడుతున్నట్లు సమాచారం. ఇక ఈ వార్త విన్న అభిమానులు.. మొన్న కార్తీ.. నేడు అనురాగ్ .. ఆసలేం ప్లాన్ చేస్తున్నావ్ బాబీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో చిరు- బాబీ రెండో హిట్ ను అందుకుంటారో లేదో చూడాలి.
Mythri Movie Makers: 'ఉప్పెన' బాటలో 'డ్యూడ్'....
Pawan Kalyan: పవన్ కోసం మరో కథ.. ఇవన్నీ వర్కవుట్ అవుతాయా..