C. Nagaraju: అల్లు అరవింద్ ని వెంటాడిన మరో విషాదం
ABN , Publish Date - Sep 07 , 2025 | 09:16 PM
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ Allu Aravind) ఇంట ఈ మధ్యనే పెద్ద విషాదం చోటుచేసుకున్న విషయం తెల్సిందే. అరవింద్ తల్లి కనకరత్నం అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెల్సిందే.
C. Nagaraju: ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ Allu Aravind) ఇంట ఈ మధ్యనే పెద్ద విషాదం చోటుచేసుకున్న విషయం తెల్సిందే. అరవింద్ తల్లి కనకరత్నం అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెల్సిందే. తల్లి మరణం మరువకముందే అల్లు అరవింద్ ను మరో విషాదం వెంటాడింది. ఆయన చిన్నటి స్నేహితుడు, గీతా ఆర్ట్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సి. నాగరాజు మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కన్నుమూశారు. ఆయన మృతితో మరోసారి అల్లు అరవింద్ విషాదంలో మునిగిపోయారు.
చిన్నప్పటి నుంచి నాగరాజుకు అల్లు అరవింద్ అంటే చాలా ఇష్టం. అందుకే నాగరాజు.. హైదరాబాద్ కు షిప్ట్ అయ్యారు. గీతా ఆర్ట్స్ నిర్మించిన మాస్టర్ సినిమా నుంచి ఆ సంస్థలోనే ఎన్నో సినిమాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. గీతా ఆర్ట్స్ లో ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. నాగరాజు.. అల్లు అరవింద్ కు స్నేహితుడు అనడం కన్నా ఒక ఫ్యామిలీ మెంబర్ అని చెప్పవచ్చు. అందుకే ఆయన అంత్యక్రియలకు సంబంధించిన కార్యక్రమాలు అని అల్లు అరవింద్ దగ్గరుండి చూసుకున్నారు.
ఇక నాగరాజుకు భార్య, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. అల్లు అరవింద్ తో పాటు నాగరాజు.. రవిరాజా పినిశెట్టి, ఏడిద నాగేశ్వరరావు కుమారులు, బన్నీ వాసు, వంశీ నందిపాటి, బండ్ల గణేష్, సురేష్ కొండేటి కి కూడా మంచి మిత్రుడు కావడంతో వారు కూడాఅంత్యక్రియలకు హాజరయ్యి సంతాపం తెలిపారు. ఏదిఏమైనా అల్లు అరవింద్ కు తల్లి మరణం మరువకముందే స్నేహితుడు మరణించడం చాలా బాధకరమైన విషయమని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు.
Trisha Krishnan: విజయ్ తో ఏమి లేనప్పుడు అంత సిగ్గెందుకు పడుతున్నావ్ పాప..
Saiyaara OTT: ఓటీటీకి.. దేశాన్ని షేక్ చేసిన రొమాంటిక్ సినిమా.! ఎప్పటినుంచంటే