Bigg Boss9: దాదాపు.. ఆ ఆరుగురు ఫిక్స్
ABN , Publish Date - Aug 28 , 2025 | 06:23 PM
బిగ్‌బాస్ సీజన్ 9 అప్డేట్స్ సోషల్ మీడియాని ఊపేస్తున్నాయి. కంటెస్టెంట్ల లిస్ట్ చూస్తోంటే ఈసారి ఎంటర్టైన్‌మెంట్ ..అన్ లిమిటెడ్ గ్యారంటీ అనిపిస్తోంది. లైనప్‌లో వినిపిస్తున్న పేర్లు చూసి అల్రెడీ షోపై హైపెక్కిపోతోంది. ఇంతకీ సీజన్ 9లో ఎంట్రీ ఇవ్వబోతున్న సెలబ్రెటీలు ఎవరు.
బిగ్ బాస్ సీజన్ 9 (Bigg Boss) గ్రాండ్‌గా స్టార్ట్ కాబోతోంది. మరో 10 రోజుల్లో మొదలవనున్న ఈ రియాల్టీ షో ఈ సారి టోటల్‌గా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందని ఇప్పటికే హోస్ట్ నాగార్జున (Nagarjuna) హింట్ ఇచ్చేశాడు. అందుకు తగ్గట్టే సోషల్ మీడియాలో రిలీజ్ అయిన ప్రోమోలు ఫ్యాన్స్‌ని ఇప్పటికే హైప్ మోడ్‌లోకి తీసుకెళ్లాయి. ఇక ఈ సీజన్‌లో కామన్ మ్యాన్‌కి స్పెషల్ టికెట్ ఇవ్వడానికి 'బిగ్ బాస్ అగ్నిపరీక్ష' (Agnipariksha) అనే కొత్త షో స్టార్ట్ చేశారు. ఈ షో నుంచి 15 మందిలో టాప్ ఐదుగురు హౌస్‌లోకి ఎంటర్ అవ్వబోతుండటం ఆసక్తిరేపుతుండగా.. మొత్తం షోలో పాల్గొనే వారి పేర్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
బిగ్ బాస్ సీజన్ 9లో పాల్గొనే సెలబ్రిటీ లైనప్ విషయానికొస్తే.. ఈ సీజన్ లిస్ట్ సూపర్ క్రేజీగా ఉంది. సెలబ్రిటీ గ్రూప్‌లో ఆరుగురు దాదాపు ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. జబర్దస్త్ స్టార్ ఇమ్మాన్యుయేల్ (Jabardasth Emmanuel) ఈ లిస్ట్‌లో ఒకడు అని అంటున్నారు. ఇమ్మాన్యుయేల్ కి బిగ్ బాస్ నుంచి సాలిడ్ ఆఫర్ రావడంతో ఓకే చెప్పాడని అంటున్నారు. సీరియల్ స్టార్ తనూజ ( Thanuja ) ఈ సీజన్‌లో కన్ఫర్మ్ అని గుసగుసలు వినిపిస్తున్నాయి.
సీరియల్ యాక్టర్ భగత్ (Bhagat) కూడా ఈ గేమ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. ఒకప్పటి హీరోయిన్ ఆషా సైనీ ( Asha Shaini ) సైతం ఈ సీజన్‌లో సందడి చేయడానికి రెడీ అవుతోందని చెప్పుకుంటున్నారు. ఇక ఇటీవల సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన అలేఖ్య పికిల్స్ (Alekhyaa Pickles )ఫేమ్ రమ్య ( Ramya ) కూడా ఈ టీమ్‌లో జాయిన్ అవుతోందని అంటున్నారు. ఇకపోతే ఈ సీజన్‌లో ట్విస్ట్ ఏంటంటే. రెండు టీమ్‌లు, రెండు హౌస్‌లతో గేమ్ సూపర్ ఇంటెన్స్ అవ్వబోతోందట. మొత్తానికి షో మొదలవ్వకముందే సోషల్ మీడియా బిగ్ బాస్ ఫీవర్‌తో ఊగిపోతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..
Read Also: Akhanda 2: అనుకున్నంత అయింది.. ఓజీకి లైన్ క్లియర్! అఖండ2 వాయిదా
Read Also: Shilpa Shirodkar: జటాధర నుంచి.. శిల్పా శిరోద్కర్ లుక్! మహేశ్ బాబు వదిన.. ఇరగదీసిందిగా