Akhanda 2: అనుకున్నంత అయింది.. ఓజీకి లైన్ క్లియర్! అఖండ2 వాయిదా
ABN , Publish Date - Aug 28 , 2025 | 05:31 PM
అనుకున్నంత అయింది. ఈ సెప్టెంబర్ 25న విడుదల కావాల్సిన మోస్ట్ హైప్‌డ్ ఇండియన్ మూవీ అఖండ2 వాయిదా పడింది.
అనుకున్నంత అయింది. ఈ సెప్టెంబర్ 25న విడుదల కావాల్సిన మోస్ట్ హైప్‌డ్ ఇండియన్ మూవీ అఖండ 2 (Akhanda2) వాయిదా పడింది. బాలకృష్ణ (Balakrishna) హీరోగా బోయపాటి శ్రీను (Boyapati Sreenu) దర్శకత్వంలో వచ్చిన అఖండ చిత్రం బాక్సాపీస్ వద్ద సంచలన విజయం సాధించి కొత్త రికార్టులను నెలకొల్పింది. మళ్లీ ఇన్నాళ్లకు ఆ చిత్రానికి సీక్వెల్‌గా అఖండ 2 చిత్రం పట్టాలెక్కగా దాదాపు షూటింగ్ పూర్తి చేసుకోవడమే గాక, డబ్బింగ్ కూడా కంప్లీట్ అయినట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఇక రిలీజే తరువాయి అనుకుంటున్న సమయంలో అప్పుడే విడుదల చేసిన టీజర్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది.
అయితే పవన్ కల్యాణ్ (Pawan Kalyan), సుజిత్ (Sujeeth) కాంబినేషన్‌లో తెరకెక్కిన మరో అవైటెడ్ మూవీ ఓజీ (OG) కూడా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించడంతో బాక్సాఫీస్ వద్ద రెండు చిత్రాల హవా మాములుగా ఉండదని, ఆకాశమే హద్దు అనే మాటలు బాగా వినిపించాయి. మరో వైపు ఈ రెండు సినిమాలలో ఏదైనా ఒకటి రిలీజ్ డేట్లు మార్చుకునే అవకాశం ఉందని, ఎవరో ఒకరు వెనకకు తగ్గుతారనే వార్తలు కూడా వచ్చాయి. కొంత మంది ఓ అడుగు ముందుకేసి ఓజీ చెప్పిన సమయానికే థియేటర్లకు వస్తుందని, అఖండే వాయిదా పడనున్ననట్లు కూడా న్యూస్ వైరల్ చేశారు.
ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ అఖండ మూవీ మేకర్స్ ప్రకటన చేశారు. ఈ ప్రకటనలో వారు అభిమానులకు క్షమాపణలు తెలుపుతూనే అఖండ 2 చిత్రం రీ-రికార్డింగ్, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) వంటి అన్ని సాంకేతిక పనుల వల్ల ఆలస్యం అవుతోందని, ప్రేక్షకుల అంచనాలను దృష్టిలో ఉంచుకుని, అందరికీ అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడం కోసం మరికొంత సమయం తీసుకుంటున్నామని తెలిపారు. అఖండ 2 కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని ఓ లెటర్ సైతం రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా బాలకృష్ణ (Balakrishna) ఫ్యాన్స్ తీవ్రంగా నిరాశ చెందుతున్నారు.