Shilpa Shirodkar: జటాధర నుంచి.. శిల్పా శిరోద్కర్ లుక్! మహేశ్ బాబు వదిన.. ఇరగదీసిందిగా
ABN , Publish Date - Aug 28 , 2025 | 03:19 PM
ఏడాది విరామం తర్వాత నవ దళపతి సుధీర్‌బాబు (Sudheer Babu) నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం జటాధర
ఏడాది విరామం తర్వాత నవ దళపతి సుధీర్‌బాబు (Sudheer Babu) నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం జటాధర (Jatadhara). మైథలాజికల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రంతో బాలీవుడ్ అగ్ర కథానాయిక సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుండగా మరో నాయిక దివ్యా కోస్లా రీ ఎంట్రీ ఇస్తుంది. అంతేగాక అలనాటి బ్యూటీ, నేటి సూపర్ స్టార్ మహేశ్ బాబు వదిన, నమత్రా శిరోద్కర్ సోదరి శిల్పా శిరోద్కర్ (Shilpa shirodkar) తెలుగులో ఆరంగేట్రం చేస్తోంది.
వెంకట్ కల్యాణ్ (Venkat Kalyan), అభిషేక్ జైస్వాల్ (Abhishek Jaiswal) దర్శక ద్వయంలో అద్భుతమైన గ్రాఫిక్స్, విజువల్ వండర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు విడుదల చేసిన పోస్టర్లు, టీజర్లు సినిమాపై అమాంతం అంచనాలు పెంచేయగా తాజాగా మూవీలో శోభగా కీలక పాత్ర చేస్తోన్న శిల్పా శిరోద్కర్ ఫస్ట్ లుక్‌ను రివీల్ చేశారు. ఈ చిత్రం చూస్తే శిల్ప ఎగిసి పడుతున్న మంట ఎదుట కూర్చోని నాలుక బయట పెట్టి మరి బయపెట్టే లుక్‌లో స్టన్నింగ్‌గా ఉంది.