Actor Abhinay: ఇండస్ట్రీలో విషాదం.. నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ మృతి

ABN , Publish Date - Nov 10 , 2025 | 03:42 PM

కోలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన అభినవ్ కింగర్ (Abhinav Kinger)(44) మృతి చెందాడు.

Abhinav

Actor Abhinay: కోలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన అభినవ్ కింగర్ (Abhinav Kinger)(44) మృతి చెందాడు. గత కొన్నాళ్లుగా లివర్ కు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న ఆయన సోమవారం మరణించినట్లు కుటుంబం సభ్యులు ధృవీకరించారు. దీంతో కోలీవుడ్ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి. అభినవ్.. మలయాళ నటి టి.పి రాధామణి కుమారుడు.

ధనుష్ హీరోగా నటించిన తుళ్ళువదో ఇలమై సినిమాతో అభినవ్ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుని అటు ధనుష్ కి ఇటు అభినవ్ కు మంచి గుర్తింపును తీసుకొచ్చి పెట్టింది. దీని తరువాత అభినవ్.. సక్సెస్, అరుముగం, ఆరోహణం లాంటి సినిమాల్లో నటించాడు. కేవలం నటుడిగానే కాకుండా అభినవ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు.

విజయ్ నటించిన తుపాకీ సినిమాలో విలన్ విద్యుత్ జమ్వాల్ కి డబ్బింగ్ చెప్పింది అభినవే. అతనితో పాటు మిలింద్ సోమాన్, బాబు ఆంటోనీకి కూడా డబ్బింగ్ చెప్పాడు. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే అభినవ్ లివర్ సంబంధిత సమస్యల బారిన పడ్డాడు. ఒక్కసారిగా బరువు తగ్గి.. అస్సలు గుర్తుపట్టలేని స్థితిలోకి వచ్చాడు. ఇక కొన్నిరోజుల క్రితం అభినవ్ ను చూసినవారంతా అతను నటుడు అని గుర్తుపట్టి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఆ సమయంలోనే తాను ఏడాది కంటే ఎక్కువ బతకను అని చెప్పాడు. ఆయన చెప్పినట్లుగానే ఏడాది కూడా నిండకుండానే అభినవ్ మరణించాడు. ఇక అతిచిన్న వయస్సులోనే అభినవ్ మరణించడం చాలా బాధాకరంగా ఉందని పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Suresh Babu: మరింత ఆలస్యంగా 'ఈNఈ రిపీట్'

Raviteja 76: టైటిల్ లీక్ ఇచ్చేశారుగా.

Updated Date - Nov 10 , 2025 | 03:42 PM