Bandla Ganesh: బుగ్గ గిల్లి జోల పాడుతున్నావా బండ్లన్న
ABN, Publish Date - Sep 19 , 2025 | 06:43 PM
ఒక్క స్పీచ్.. ఒకే ఒక్క స్పీచ్ తో బండ్ల గణేష్ (Bandla Ganesh) ట్రెండింగ్ లోకి వచ్చేశాడు. మరి స్పీచ్ అలాంటింది.
Bandla Ganesh: ఒక్క స్పీచ్.. ఒకే ఒక్క స్పీచ్ తో బండ్ల గణేష్ (Bandla Ganesh) ట్రెండింగ్ లోకి వచ్చేశాడు. మరి స్పీచ్ అలాంటింది. అసలు ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరూ మీడియా ముందు చెప్పని పచ్చి నిజాలను బండ్లన్న ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పుకొచ్చాడు. లిటిల్ హార్ట్స్ (Little Hearts) సక్సెస్ ఈవెంట్ లో హీరో మౌళీకి హిత బోధ చేస్తూ.. నెమ్మదిగా అల్లు అరవింద్ గురించి, ఇండస్ట్రీ మాఫియా గురించి ఇచ్చి పడేశాడు. ముఖ్యంగా అల్లు అరవింద్ గురించి బండ్లన్న చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీసాయి.
'ఎవరో కొన్ని వందల కోట్లలో ఒకరు ఉంటాడు.. ఒక స్టార్ కమెడియన్‌కు కొడుగ్గా, మెగాస్టార్ బావమరిదిగా, ఐకాన్ స్టార్ తండ్రిగా.. అలా వంద కోట్లలో అల్లు అరవింద్ లాంటివారు ఒకరుంటాడు. అందరు అలా ఉండలేరు. మనందరం కష్టపడాల్సిందే.. తప్పదు. ఆయన ఎప్పుడు కాలు మీద కాలు వేసుకుంటాడు. ఆయన ఎవరికీ అందుబాటులో ఉండడు. ఆయన అనుకున్నవారికి అందుబాటులోకి వెళ్తాడు. అదీ జీవితం అంటే. అంత మహర్జాతకుడిని నా జీవితంలో నేను ఎప్పుడు చూడలేదు. ఇకపై చూడను కూడా. జీవితాన్ని అంత అద్భుతంగా ప్లాన్ చేసుకున్న అల్లు అరవింద్ ఇక్కడకు రావటం చాలా సంతోషంగా ఉంది' అని చెప్పుకొచ్చాడు. అంతేనా ఏమి కష్టపడకుండా పేరు మొత్తం ఆయన కొట్టేస్తాడు అని కూడా మాట్లాడాడు.
నిజం చెప్పాలంటే ఇవేమి పొగడ్తలు కాదు. నవ్వుతూ చురకలు అంటించాడు అని చెప్పొచ్చు. అయితే అల్లు అరవింద్ ను అలా అనేసరికి నిర్మాత బన్నీ వాసు బాగా ఫీల్ అయ్యాడు. బండ్ల గణేష్ అన్నదాంట్లో వాస్తవం లేదని, అల్లు అరవింద్ బాగా కష్టపడతాడని చెప్పుకొచ్చాడు. అల్లు అరవింద్ పుట్టాకే అల్లు రామలింగయ్య స్టార్ అయ్యాడని చెప్పుకొచ్చాడు. ఇది కొంచెం అతిగా ఉందని కొందరు పెదవి విరిచినా.. బండ్ల వలనే ఇది జరిగిందని కామెంట్స్ చేసిఅద్మా మొదలుపెట్టారు. దీంతో బండ్ల.. బుగ్గ గిల్లి జోల పాడినట్లు.. సోషల్ మీడియా వేదికగా అల్లు అరవింద్ అంటే మాకు చాలా ఇష్టమని ఒక పోస్ట్ వేశాడు.
'అల్లు అరవింద్ గారు మాటల్లో చెప్పలేనంత గొప్ప నిర్మాత. ఆయన నిర్మించిన సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోయే బ్లాక్బస్టర్స్. ఆయన దూరదృష్టి, కృషి, సినిమా మీద ఉన్న ప్రేమ వలన తెలుగు సినిమా గర్వంగా నిలిచింది. అల్లు అరవింద్ గారు అంటే మాకు ఎంతో ఇష్టం' అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. స్టేజి మీద అనాల్సినవన్నీ అనేసి.. ఇప్పుడు ఇష్టం అంటున్నావా అన్న అంటూ కొందరు.. సూపర్ బాగా మాట్లాడావ్ అన్న అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ బండ్లన్న వ్యాఖ్యల పరిణామం ఎలా ఉంటుందో చూడాలి.
Ram Charan: గ్లోబల్ స్టార్.. గుడ్ విల్
The Raja Saab: సాంగ్ కోసం మరో మాసీవ్ సెట్