Bandla Ganesh: చేతులెత్తి నమస్కరిస్తున్నా.. ఇబ్బంది పెట్టకండి..

ABN , Publish Date - Nov 04 , 2025 | 07:28 PM

నటుడు, నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) రీ ఎంట్రీ గురించి కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్న విషయం తెల్సిందే.

Bandla Ganesh

Bandla Ganesh: నటుడు, నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) రీ ఎంట్రీ గురించి కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్న విషయం తెల్సిందే. గతంలో హిట్ ప్రొడ్యూసర్ గా ఒక వెలుగు వెలిగిన బండ్ల ఆ తరువాత సినిమాలకు దూరమై వ్యాపారాలతో బిజీగా మారాడు. సినిమాలు లేకపోయినా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఎప్పుడు దగ్గరగానే ఉన్నాడు.


ఇక ఈమధ్య కాలంలో బండ్ల మళ్లీ యాక్టివ్ అయ్యాడు.. సక్సెస్ మీట్స్ కు రావడం.. ఏదో ఒక మాట అని సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారడం బండ్లకు అలవాటుగా మారిపోయింది. మొన్నటికి మొన్న లిటిల్ హర్ట్స్ సక్సెస్ మీట్ లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అదే ఇంకా మర్చిపోలేదు అంటే గతరాత్రి కె ర్యాంప్ సక్సెస్ మీట్ లో మరోసారి రచ్చ చేశాడు.


రౌడీ హీరో విజయ్ దేవరకొండనే బండ్ల టార్గెట్ చేసి మాట్లాడినట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది. మళ్ళీ ఇండస్ట్రీలో నిర్మాతగా ఫుల్ బిజీ అవ్వాలని చూస్తున్న బండ్ల సినిమా ఆఫర్ ను వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న విజయ్ కాదన్నాడని.. అందుకే బండ్ల ఆ విధంగా మాట్లాడినట్లు చెప్పుకొస్తున్నారు. నిజంగానే బండ్ల సినిమా చేస్తున్నాడా.. చేస్తే ఎవరితో చేస్తున్నాడు అని మళ్లీ బండ్లపై చర్చ మొదలయ్యింది.


ఇక దీంతో బండ్ల ఈ వార్తలపై స్పందించాడు. తాను ఎలాంటి సినిమా తీయడం లేదని స్పస్టం చేశాడు. తనను ఇబ్బందిపెట్టవద్దని.. చేతులెత్తి మరీ కోరాడు. మిత్రులకు, శ్రేయోభిలాషులకు నా హృదయపూర్వక విన్నపం.. ప్రస్తుతం నేను ఏ సినిమాను నిర్మించడం లేదు, అలాగే ఎవరితోనూ సినిమా చేయాలనే నిర్ణయం కూడా తీసుకోలేదు. దయచేసి కానీ వార్తలు రాయడం ద్వారా నన్ను ఇబ్బంది పెట్టకండి. మీ అందరి ప్రేమ, మద్దతు ఎప్పుడూ నాతో వుండాలి.చేతులెత్తి నమస్కరిస్తూ విన్నవించుకుంటున్నాను' అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Jigris: మీరే లేకుంటే.. నేనొంట‌రే! 'జిగ్రీస్' నుంచి ఎమోష‌నల్ ఫ్రెండ్‌షిప్ సాంగ్‌

Purusha: ‘పురుష: స్వేచ్ఛ కోసం భర్త చేసే అలుపెరగని పోరాటం

Updated Date - Nov 04 , 2025 | 07:36 PM