Jigris: మీరే లేకుంటే.. నేనొంట‌రే! 'జిగ్రీస్' నుంచి ఎమోష‌నల్ ఫ్రెండ్‌షిప్ సాంగ్‌

ABN , Publish Date - Nov 04 , 2025 | 07:23 PM

యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా జిగ్రీస్. ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ప్ర‌మోష‌న్స్ లో వేగం పెంచారు.

Jigris

రామ్ నితిన్ (Ram Nithin), కృష్ణ బురుగుల (Krishna Burugula), మణి వక (Mani Vaka), ధీరజ్ ఆత్రేయ (Dheeraj Athreya) కీలక పాత్రల్లో నటించిన చిత్రం జిగ్రీస్(Jigris). హరీష్ రెడ్డి ఉప్పుల (Harish Reddy Uppula) దర్శకత్వం వహించిన ఈ సినిమాను మౌంట్ మెరు పిక్చర్స్ బ్యానర్‌పై కృష్ణ వోడపల్లి నిర్మిస్తున్నారు. న‌వంబ‌ర్ 14న ఈ చిత్రం థియేట‌ర్ల‌కు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం టీజర్ ను సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) రిలీజ్ చేయ‌గా మంచి ఆద‌ర‌ణ ద‌క్కించుకుంది. ఆపై వ‌చ్చిన పోస్టర్స్, ఫ‌స్ట్ సింగిల్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ సినిమా ప్ర‌మోష‌న్స్ లో వేగం పెంచారు. ఈ క్ర‌మంలో తాజాగా మంగ‌ళ‌వారం ఈ చిత్రం నుంచి మీరే లేకుంటే.. నేనొంట‌రే.. అడుగై క‌దిలేటి మీ నీడ‌నే.. ఏ చోటా చూసిన.. మీ జ్ఞాపకాల్లో లేనా.. నా చిన‌నాటి ప్ర‌తి గుర్తు.. మిగిలే క‌థ లాగా క‌డ వ‌ర‌కు అంటూ సాగే ఎమోష‌న‌ల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. స్వ‌యానా ద‌ర్శ‌కుడు హరీష్ రెడ్డి ఈ పాట‌కు సాహిత్యం అందించ‌గా స‌య్య‌ద్ క‌మ్రాన్ సంగీతంలో ఎక్‌నాథ్ ఆల‌పించాడు.

ముఖ్యంగా పాటలోని సాహిత్యం ఆకట్టుకునేలా ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన పాట‌ల‌కు కాస్త భిన్నంగా ఉంది. సాహిత్యం చాలా ప్రెష్‌గా ఉండి, స్నేహం విలువ‌ను తెలియ జేసేలా.. ఎడ‌బాటుతో వ‌చ్చే ఎమోష‌న్‌, బాల్యం అన్నింటిని మిక్స్ చూస్తే అద్భుతంగా ఉంది. చిత్రీక‌ర‌ణ కూడా అదే స్తాయిలో ఉంది. ఎవ‌రైనా ఒక‌సారి వింటే ఇట్టే క‌నెక్ట్ అయ్యేలా ఉంది.

Updated Date - Nov 04 , 2025 | 07:23 PM