Bandla Ganesh: స్టేజిపై అనడం ఎందుకు.. మళ్లీ క్షమించమని కోరడమెందుకు
ABN, Publish Date - Nov 05 , 2025 | 04:35 PM
ఇటీవల కె ర్యాంప్ (K Ramp) సక్సెస్ మీట్ లో బండ్ల గణేష్ (Bandla Ganesh) చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో రచ్చ చేశాయో అందరికీ తెల్సిందే.
Bandla Ganesh: ఇటీవల కె ర్యాంప్ (K Ramp) సక్సెస్ మీట్ లో బండ్ల గణేష్ (Bandla Ganesh) చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో రచ్చ చేశాయో అందరికీ తెల్సిందే. బండ్ల గణేష్.. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)ను ఉద్దేశించే మాట్లాడాడని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. అలా అనడం తప్పు అని.. పర్సనల్ గా ఒక హీరోను టార్గెట్ చేయడం పద్దతి కాదని మండిపడుతున్నారు. సినిమా ఒప్పుకోకపోవడంతోనే బండ్ల కక్ష పెట్టుకొని విజయ్ గురించి మాట్లాడని కొందరు.. ఈగో వలన అని ఇంకొందరు చెప్పుకొచ్చారు.
ఇక బండ్ల గణేష్ ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. నిన్నటికి నిన్న తానెవరితో కూడా సినిమా నిర్మించడం లేదని క్లారిటీ ఇచ్చిన బండ్ల.. తాజాగా సక్సెస్ మీట్ లో తాను చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేయలేదని క్లారిటీ ఇచ్చాడు. అంతేకాకుండా ఎవరినైనా బాధపెడితే క్షమించమని కోరాడు. 'ఇటీవల కె రాంప్ సినిమా సక్సెస్ మీట్‌లో నేను మాట్లాడిన మాటలు కొందరిని బాధపెట్టాయని తెలిసింది. నేను ఎవరినీ ఉద్దేశించి మాట్లాడలేదు. నా ఉద్దేశం అందరూ బాగుండాలి, కళామాత ఆశీస్సులతో అందరం పైకి రావాలని మాత్రమే.. ఎవరైనా బాధపడి ఉంటే క్షమాపణలు' అంటూ రాసుకొచ్చాడు.
కొద్దిసేపటికే ఎవరైనా బాధపడి ఉంటే క్షమాపణలు అనే లైన్ ను డిలీట్ చేసి పోస్ట్ చేశాడు. దీంతో మరోసారి బండ్లన్నపై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. లిటిల్ హార్ట్స్ సక్సెస్ మీట్ లో అల్లు అరవింద్ గురించి మాట్లాడి.. ఆ తరువాత ఆయన అంటే గౌరవం.. ప్రేమ అన్నావు. ఇప్పుడేమో మాట్లాడాల్సిందంతా మాట్లాడేసి క్షమాపణలు అంటున్నావ్.. స్టేజిపై అనడం ఎందుకు.. మళ్లీ క్షమించమని కోరడమెందుకు బండ్ల అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
Bandla Ganesh: చేతులెత్తి నమస్కరిస్తున్నా.. ఇబ్బంది పెట్టకండి..
NTR: అయ్యా.. అయ్యా.. ఊరమాస్ లుక్ అయ్యా..