సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

NBK: సినిమా పెద్దలు.. ఆలోచించాలి! ఇండస్ట్రీకి.. బాలయ్య సూచనలు

ABN, Publish Date - Nov 29 , 2025 | 07:54 PM

నందమూరి బాలకృష్ణ మాట ముక్కుసూటి మనిషి ఏదైనా, ఎదుటి వ్యక్తి ఎవరైనా చెప్పాలనుకున్నది సూటిగా చెబుతారు. శుక్రవారం రాత్రి జరిగిన అఖండ 2 ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ఆయన  ఇండస్ట్రీ కి  కీలక సూచనలు చేశారు.

NBK

   
నందమూరి బాలకృష్ణ (NBK) మాట ముక్కుసూటి మనిషి ఏదైనా, ఎదుటి వ్యక్తి ఎవరైనా చెప్పాలనుకున్నది సూటిగా చెబుతారు. శుక్రవారం రాత్రి జరిగిన అఖండ 2 (Akhanda 2)ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ఆయన ఇండస్ట్రీకి  కీలక సూచనలు చేశారు. మనిషికి నిత్యావసర వస్తువులు ఎంత అవసరమే సినిమాను కూడా అలాగే భావిస్తున్నారు. అలాంటి సినిమా ఎలా ఉండాలని చలనచిత్ర పరిశ్రమ పెద్దలు ఆలోచించాలి.

అలాగే సినిమా షూటింగ్స్‌ లో జరుగుతున్న జాప్యం గురించి కూడా ఆలోచించాలి. అఖండ 2 చాలా కష్టమైన లొకేషన్స్‌లో షూటింగ్‌ చేశాం. కానీ అనుకున్న సమయానికి పూర్తి చేశాం. క్రమశిక్షణ అనేది మా నాన్నగారి దగ్గర నుంచి అలవరింది. దయ చేసి పరిశ్రమలో అందరూ ఇది పాటించాలి. ఈ సినిమా హిందీ వెర్షన్‌కు స్వయంగా డబ్బింగ్‌ చెప్పాను’ మన స్టైల్ చూసి హిందీ వాళ్ళకి దిమ్మ తిరిగిపోయింది అని అన్నారు.

అయితే బాలయ్య ఇచ్చిన సూచన విలువైనదే. అనుకున్న సమయానికి షూటింగులు పూర్తి కాక నిర్మాతలు ఇక్కట్లు పడుతున్నారు. పని దినాలు పెరగడంతో ప్రొడక్షన్‌ ఖర్చు పెరుగుతుంది. నిర్మాతలపై అదనపు భారం పడుతుంది. కొందరు షెడ్యూల్స్‌ ప్లానింగ్‌ కరెక్ట్‌గా లేక సాగదీస్తారు. మరికొందరు సినిమా క్వాలిటీగా ఉండాలంటూ లేట్‌ చేస్తుంటారు. రెండు కూడా బడ్జెట్‌ పెంచే అంశాలే! అయితే ఈ విషయంలో బాలయ్య ప్రణాళిక మాత్రం మంచిదే. ఆయన మాత్రం వరుస సినిమాలు అత్యంత వేగంగా చేసుకుంటూ వెళ్తున్నారు. 

ALSO READ: Discover Andhra - Sai Tej: ఆంధ్రాలో ఇన్ని అద్భుతాలు ఉన్నాయా..


Thimmarajupalli TV:  ఔత్సాహిక కళాకారులకు అండగా  కిరణ్ అబ్బవరం

Nuvvu Naku Nachavu: ‘నువ్వు నాకు నచ్చావు’ రీ రిలీజ్‌.. ఎప్పుడంటే..

Updated Date - Nov 29 , 2025 | 10:06 PM