Bahubali The Epic Trailer: బాహుబలి తిరిగొచ్చాడు.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ట్రైలర్
ABN , Publish Date - Oct 24 , 2025 | 10:13 PM
కొన్ని సినిమాలు కేవలం సినిమాలు మాత్రమే కాదు.. ఇండస్ట్రీ తలరాతను మార్చే కళాఖండాలు. అలాంటి ఒక కళాఖండమే బాహుబలి (Bahubali).
Bahubali The Epic Trailer: కొన్ని సినిమాలు కేవలం సినిమాలు మాత్రమే కాదు.. ఇండస్ట్రీ తలరాతను మార్చే కళాఖండాలు. అలాంటి ఒక కళాఖండమే బాహుబలి (Bahubali). తెలుగు ఇండస్ట్రీ చరిత్రను తిరగరాసిన సినిమా. అసలు తెలుగు సినిమాల వైపు చూడని ప్రపంచాన్ని మొత్తం తన వైపు లాగి ఇది తెలుగు సినిమా అంటే అని నిరూపించిన సినిమా. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ, నాజర్ లాంటి స్టార్స్ అందరూ నటించారు.
రెండు భాగాలుగా రిలీజ్ అయిన ఈ చిత్రం పాన్ ఇండియా అనే పదాన్ని ఇండస్ట్రీకి పరిచయం చేసింది. కలక్షన్స్ లో రికార్డులు సృష్టించింది. ఇప్పటికీ ఏ పెద్ద సినిమా వచ్చినా బాహుబలి రికార్డ్స్ ను దాటిందా.. లేదా అనేదే చూస్తారు. అలాంటి సినిమా మళ్లీ రాబోతుంది. ఈసారి సరికొత్తగా.. రెండు భాగాలను కలిపి జక్కన్న బాహుబలి ది ఎపిక్ పేరుతో రిలీజ్ చేస్తున్నాడు. అదేంటీ రీ రిలీజ్ కదా అంటే.. కాదు. ముందు రెండు భాగాల్లో లేని సీన్స్ ను యాడ్ చేసి సరికొత్త కథగా తీర్చిదిద్దాడు.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా బాహుబలి ది ఎపిక్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. రెండు సినిమాలను ఇప్పటికే చూసినా.. ప్రతి ఫ్రేమ్, ప్రతి డైలాగ్ కంఠస్తా పట్టినా కూడా ఈ ట్రైలర్ ను కొత్త సినిమా ట్రైలర్ లానే చూస్తున్నారు ప్రేక్షకులు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇద్దరు అన్నదమ్ములు.. ఒక సింహాసనం, ఇద్దరు మహిళలు.. ఒక పోరాటం, రెండు ప్రామిస్ లు.. ఒక అతిక్రమణ అంటూ కథను మొత్తం ఈ లైన్స్ లో చెప్పేశారు.
రెండు భాగాల్లో సీన్స్ అన్ని ఒకే ట్రైలర్ లో చూస్తుంటే.. కథను ఎలా చెప్పబోతున్నాడు అనేది కొద్దిగా కన్ఫ్యూజన్ ఏర్పడింది. అమరేంద్ర బాహుబలి స్టోరీని ముందు చూపించి ఆ తరువాత మహేంద్ర బాహుబలిని చూపించారు. ఇక ఇండస్ట్రీని షేక్ చేసిన డైలాగ్స్ ట్రైలర్ లో యాడ్ చేశారు. ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అక్టోబర్ 31 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా రీ రిలీజ్ ల రికార్డులను తిరగరాస్తుందేమో చూడాలి.
Peddi: శ్రీలంకలో పెద్ది రొమాన్స్..
Pradeep Ranganathan: హీరోనే కాదన్నారు.. హ్యాట్రిక్ కొట్టి చూపించాడు