Peddi: శ్రీలంకలో పెద్ది రొమాన్స్..

ABN , Publish Date - Oct 24 , 2025 | 09:38 PM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), జాన్వీ కపూర్ (Janhvi Kapoor) జంటగా బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న చిత్రం పెద్ది (Peddi).

Peddi

Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), జాన్వీ కపూర్ (Janhvi Kapoor) జంటగా బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న చిత్రం పెద్ది (Peddi). ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ ప్రతిష్టాత్మకంగా సమర్పిస్తున్న ఈ సినిమాను వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫిర్చ్ షాట్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు హైప్ ను కూడా క్రియేట్ చేశాయి.

ప్రస్తుతం పెద్ది షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇప్పటికే 60 శాతం షూటింగ్ ఫినిష్ అయ్యిందని తెలుస్తోంది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే పెద్ది నుంచి మొదటి సాంగ్ రిలీజ్ కానుందని మేకర్స్ తెలిపారు. ఇక తాజాగా పెద్ది టీమ్ శ్రీలంకకు పయనమయ్యింది. అక్కడ ఒక సాంగ్ షూట్ చేయనున్నారు. చరణ్, జాన్వీ ల మీద రొమాంటిక్ సాంగ్ ను షూట్ చేయనున్నట్లు సమాచారం.

ఉప్పెన లాంటి హిట్ సినిమా తరువాత రామ్ చరణ్ ను డైరెక్ట్ చేసే అవకాశం బుచ్చికి రావడం గొప్ప అవకాశం. దీన్ని కనుక సద్వినియోగం చేసుకుంటే ఇండస్ట్రీలో బుచ్చికి ఎదురే లేదు అని చెప్పొచ్చు. ఇప్పటివరకు వచ్చిన అవుట్ ఫుట్ చరణ్ ను సంతృప్తి పరిచిందని టాక్. వచ్చే ఏడాది మార్చి 27 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో చరణ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Pradeep Ranganathan: హీరోనే కాదన్నారు.. హ్యాట్రిక్ కొట్టి చూపించాడు

Sharwanand: గుర్తుపట్టలేకుండా మారిపోయిన కుర్ర హీరో... మరీ ఇలా ఎలా

Updated Date - Oct 24 , 2025 | 09:38 PM