Pradeep Ranganathan: హీరోనే కాదన్నారు.. హ్యాట్రిక్ కొట్టి చూపించాడు
ABN , Publish Date - Oct 24 , 2025 | 08:14 PM
కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) 'డ్యూడ్' సినిమా దీపావళి సీజన్ లో జనం ముందు నిలచింది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన 'డ్యూడ్' సినిమా గురువారం వంద కోట్ల క్లబ్ లో చోటు సంపాదించింది.
Pradeep Ranganathan: కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) 'డ్యూడ్' సినిమా దీపావళి సీజన్ లో జనం ముందు నిలచింది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన 'డ్యూడ్' సినిమా గురువారం వంద కోట్ల క్లబ్ లో చోటు సంపాదించింది. దాంతో ప్రదీప్ రంగనాథన్ కెరీర్ లో వరుసగా వంద కోట్లు చూసిన మూడో సినిమాగా 'డ్యూడ్' నిలచింది. ఇంతకు ముందు తాను హీరోగా నటించిన తొలి చిత్రం 'లవ్ టుడే'తోనే వంద కోట్ల క్లబ్ లో చేరిపోయాడు ప్రదీప్. మూడేళ్ళ గ్యాప్ తీసుకొని ఈ యేడాది ముందుగా 'డ్రాగన్'తో పలకరించాడు ప్రదీప్.ఈ సినిమా 150 కోట్ల రూపాయలు పోగేసింది. ఇప్పుడు 'డ్యూడ్' వంద కోట్లు చూసింది. దీంతో కెరీర్ లో వరుసగా వంద కోట్లు చూసి 'హ్యాట్రిక్' పట్టేశాడు. అసలు హీరో మెటీరీయల్ కాదు అని ట్రోల్స్ చేసిన వారితోనే సూపర్ అనిపించుకున్నాడు. ఇదే సంవత్సరం డిసెంబర్ 18న ప్రదీప్ నటించిన తాజా చిత్రం 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' కూడా వస్తోంది. అది కూడా నూరు కోట్లు పోగేసిందనుకోండి- ఈ యేడాదే వరుసగా మూడు సినిమాలతో వంద కోట్ల క్లబ్ చూసి, ప్రదీప్ 'హ్యాట్రిక్' సాధించినట్టవుతుంది. ప్రస్తుతం ప్రదీప్ హ్యాట్రిక్ కొడతాడా లేదా అన్న దానిపైనే చర్చ సాగుతోంది.
తొలుత ప్రదీప్ 2019లో డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు.. ప్రదీప్ తెరకెక్కించిన తొలి చిత్రం 'కోమాలి' తమిళంలో రూపొందింది. ఈ సినిమా అప్పట్లోనే 91 కోట్లు రాబట్టి అందరిలోనూ ఆసక్తిని కలిగించింది. తరువాత 2022లో తానే హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించి 'లవ్ టుడే' సినిమా రూపొందించారు ప్రదీప్. కేవలం ఐదు కోట్ల రూపాయలతో రూపొందిన 'లవ్ టుడే' 105 కోట్లు సంపాదించింది. ఇక ఈ యేడాది వచ్చిన ప్రదీప్ మొదటి సినిమా 'డ్రాగన్' 37 కోట్లతో తెరకెక్కి, 150 కోట్లు చూసింది. తరువాత వచ్చిన 'డ్యూడ్' 30 కోట్లతో రూపొంది 100 కోట్లు రాబట్టింది. ఇలా ప్రదీప్ నిర్మాతలకు మినిమమ్ గ్యారంటీ హీరో అనిపించుకుంటున్నారు. అందువల్లే ప్రదీప్ రాబోయే సినిమా 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' కూడా వంద కోట్లు రాబట్టవచ్చని కోలీవుడ్ ట్రేడ్ పండిట్స్ అంటున్నారు.
ప్రదీప్ రంగనాథన్ సినిమాల్లో కథ,కథనం జనాన్ని ఆకట్టుకొనేలా ఉంటున్నాయి. ప్రదీప్ కూడా తన పర్సనాలిటీకి తగ్గ పాత్రలు ఎంచుకొని సాగుతున్నాడు. అందువల్ల తెలుగునాట కూడా ప్రదీప్ సినిమాలకు ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' సైతం పెట్టుబడి కంటే మిన్నగా పోగేస్తుందని కోలీవుడ్ ట్రేడ్ పండిట్స్ అంచనా వేస్తున్నారు. మొదట్లో 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ'ని కూడా 'డ్యూడ్' రిలీజయిన అక్టోబర్ 17న రిలీజ్ చేయాలని భావించారు. అయితే ఒకే రోజున వచ్చి ఒకటి బాగు పడడం కంటే వేర్వేరుగా జనం ముందు నిలచి వారి మనసులు గెలవాలని ప్లాన్ చేశారు. అందువల్ల డిసెంబర్ 18న 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' రానుంది. ఈ సినిమా వచ్చిన మరుసటి రోజునే హాలీవుడ్ క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ 'అవతార్-3' అనేక భారతీయ భాషల్లో రిలీజ్ అవుతోంది... అందువల్ల 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' వంద కోట్లు పోగేస్తుందా లేదా అన్న అనుమానాలు తలెత్తాయి. పైగా ఈ సినిమా ప్రదీప్ కెరీర్ లోనే హై బడ్జెట్ గా 60 కోట్లతో రూపొందింది... ఈ కోణంలోనూ కొందరు డౌట్ పడుతున్నారు... 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' కూడా వంద కోట్లు పోగేస్తే ప్రదీప్ రంగనాథన్ రాబోయే రోజుల్లో మరింత స్పీడు పెంచవచ్చని తెలుస్తోంది. ఏమవుతుందో చూడాలి.
Sharwanand: గుర్తుపట్టలేకుండా మారిపోయిన కుర్ర హీరో... మరీ ఇలా ఎలా
Akhanda 2: సౌండ్ కంట్రోల్లో పెట్టుకో.. బాలయ్య తాండవం మొదలు