Prabhas: బాహుబలి ది ఎపిక్ ప్రమోషన్స్.. స్వీటీ కూడా ఉంటే ఎంత బావుండేదో

ABN , Publish Date - Oct 27 , 2025 | 04:18 PM

మాహిష్మతి ఊపిరి పీల్చుకో.. బాహుబలి తిరిగిస్తున్నాడు. ప్రస్తుతం ఈ డైలాగ్ ను కొద్దిగా మార్చి టాలీవుడ్ ఊపిరి పీల్చుకో బాహుబలి మళ్లీ వస్తున్నాడు అని చెప్పుకొస్తున్నారు.

Bahubali The Epic

Prabhas: మాహిష్మతి ఊపిరి పీల్చుకో.. బాహుబలి తిరిగిస్తున్నాడు. ప్రస్తుతం ఈ డైలాగ్ ను కొద్దిగా మార్చి టాలీవుడ్ ఊపిరి పీల్చుకో బాహుబలి మళ్లీ వస్తున్నాడు అని చెప్పుకొస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ గతిని మార్చిన సినిమా బాహుబలి (Bahubali). దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ (Prabhas), అనుష్క (Anushka) జంటగా నటించగా రానా దగ్గుబాటి (Rana Daggubati) విలన్ గా నటించాడు. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా రికార్డ్ కలక్షన్స్ రాబట్టాయి.

ఇక ఈ మధ్య రీ రిలీజ్ లట్రెండ్ నడుస్తున్న విషయం తెల్సిందే. దీంతో బాహుబలిని కూడా రీ రిలీజ్ చేస్తే బావుండు అని అభిమానులు కోరుకున్నారు. వారి కోరికను రాజమౌళి ఎట్టకేలకు తీర్చాడు. అయితే రీ రిలీజ్ లా కాకుండా రెండు భాగాలను కలిసి ఒకే సినిమాగా అది కూడా కొత్త సినిమాగా రిలీజ్ చేస్తున్నాడు. ఈ రెండు భాగాలను కలిపి బాహుబలి ది ఎపిక్ అనే పేరుతో అక్టోబర్ 31 న రిలీజ్ చేస్తున్నారు.

ఇక రీ రిలీజ్ అయినా కూడా కొత్త సినిమాలా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి.. దీనికి కూడా ప్రమోషన్స్ చేయడం స్టార్ట్ చేశారు. మామూలుగానే రాజమౌళి ప్రమోషన్స్ చేయడంలో దిట్ట. బాహుబలి ది ఎపిక్ కూడా తనదైన రీతిలో ప్రమోషన్స్ చేస్తున్నాడు. ఇప్పటికే బాహుబలి ది ఎపిక్ నుంచి టీజర్, ట్రైలర్ ను రిలీజ్ చేయడమే కాకుండా మేకింగ్ వీడియోస్ ని కూడా రిలీజ్ చేస్తూ హైప్ క్రియేట్ చేశారు. ఇక తాజాగా బాహుబలి మెయిన్ ఫిల్లర్స్ రీ యూనియన్ అయ్యారు.

ప్రభాస్, రానా, రాజమౌళి ముగ్గురు కలిసి ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో బాహుబలి 1 , బాహుబలి 2 షూటింగ్ సమయంలో జరిగిన అనేక విషయాలను వీరు ముగ్గురు చర్చించుకున్నారు. అంతేకాకుండా వారి ఫేవరేట్ డైలాగ్స్, సీన్స్ ని చెప్పుకొచ్చారు. ఇక ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ ప్రోమో చూసిన అభిమానులు స్వీటి కూడా ఉంటే ఇంకా బావుండేదని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమా మరోసారి ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Kantara: Chapter 1: 'ఆర్.ఆర్.ఆర్.' కలెక్షన్స్ కు చేరువగా...

Spirit: కథను మలుపు తిప్పడమే కాదు.. అదే ప్రాణం కూడా..

Updated Date - Oct 27 , 2025 | 04:18 PM