Kantara: Chapter 1: 'ఆర్.ఆర్.ఆర్.' కలెక్షన్స్ కు చేరువగా...
ABN , Publish Date - Oct 27 , 2025 | 04:08 PM
కాంతార: చాప్టర్ 1 అతి త్వరలోనే వెయ్యి కోట్ల క్లబ్ లో చోటు సంపాదించుకుంటుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం హిందీ డబ్బింగ్ వర్షన్ రూ. 200 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. త్వరలోనే ఇది టాప్ ఫైవ్ జాబితాలోకి చేరిపోతుందని అంటున్నారు.
జాతీయ ఉత్తమ నటుడు రిషబ్ శెట్టి నటించిన తాజా చిత్రం 'కాంతార' వెయ్యి కోట్ల క్లబ్ లో చేరడానికి తహతహలాడుతోంది. ఇంతవరకూ 800 కోట్లకు పైగా గ్రాస్ ను ఈ సినిమా వసూలు చేసింది. త్వరలో ఇంగ్లీష్ వర్షన్ కూడా రిలీజ్ కానుండటంతో ఖచ్చితంగా ఇది వెయ్యి కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరో విశేషం ఏమంటే... హిందీలో తాజాగా 'కాంతార: చాప్టర్ 1' రూ. 200 కోట్ల గ్రాస్ ను దాటేసింది. దాంతో ఈ సినిమా నెక్ట్స్ టార్గెట్ 'ట్రిపుల్ ఆర్' మూవీ అని ట్రేడ్ పండిట్స్ చెబుతున్నారు.
ప్రముఖ దర్శకుడు రాజమౌళి... ఎన్టీఆర్, రామ్ చరణ్ తో తెరకెక్కించిన 'ట్రిపుల్ ఆర్' మూవీ అప్పట్లో ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమా హిందీ వర్షన్ రూ. 277 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. అలానే దీనిపైన స్థానంలో ప్రభాస్ నటించిన 'కల్కి 2898 ఎ.డి.' ఉంది. ఈ సినిమా హిందీ వర్షన్ రూ. 295 కోట్లు వసూలు చేసింది. అయితే విడుదలైన మొదటి రోజు నుండే పాజిటివ్ టాక్ తో సాగిపోతున్న 'కాంతార: చాప్టర్ 1' సినిమా టాప్ టెన్ హిందీ డబ్బింగ్ మూవీస్ జాబితాలో ఉన్న 'బాహుబలి': ది బిగినింగ్, 'సాహో', 'సలార్', '2.0' సినిమాలను అధిగమించి ప్రస్తుతం ఆరవ స్థానంలో ఉంది. రేపు ఫుల్ రన్ లో ఈ సినిమా 'ట్రిపుల్ ఆర్'ను, 'కల్కి'ని క్రాస్ చేసి ముందుకు వెళ్ళినా... దీని ముందు మరో మూడు సినిమాలు ఉంటాయి. బాలీవుడ్ డబ్బింగ్ మూవీస్ లో అగ్రస్థానంలో 'పుష్ప -2' రూ. 836 కోట్లు, 'బాహుబలి 2: ది కన్ క్లూజన్ రూ. 511 కోట్లు, కె.జీ.ఎఫ్. చాప్టర్ 2: రూ. 434.62 కోట్లు వసూలు చేశాయి. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'కాంతార: చాప్టర్ 1'తో ఉత్తరాది ప్రేక్షకులు బాగానే కనెక్ట్ అయ్యారు. అందుకే అతి సునాయాసంగా ఈ సినిమా అక్కడ 200 కోట్ల మార్క్ ను దాటేసింది. అన్ని అనుకున్నట్టు జరిగితే... 'కాంతార: చాప్టర్ 1' టాప్ ఫైవ్ లో చోటు దక్కించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.
Also Read: Spirit: కథను మలుపు తిప్పడమే కాదు.. అదే ప్రాణం కూడా...
Also Read: SSS Motion Poster: టైం పది అయ్యింది... గ్లాసులు కడుక్కునే టైం అయ్యింది