సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Baahubali’s Eternal War: 2027లో యానిమేటెడ్ బాహుబలి

ABN, Publish Date - Nov 05 , 2025 | 04:52 PM

'బాహుబలి' మూవీ ఇంకా అయిపోలేదా... వెన్నుపోటుతో చనిపోయిన వీరుడు మరో యుద్ధానికి రెడీ అవుతున్నాడా? ఈ సారి శత్రువులతో కాకుండా దేవతలతోనే పోరాటం చేయబోతున్నాడా? అసలు బాహుబలి సినిమా ఏంటి... ఈ ప్రశ్నలు ఏంటి అని ఆశ్యర్యపోతున్నారా... అయితే ఈ స్టోరీ చదివేయండి...

భారతీయ సినిమా చరిత్రలో సంచలనం సృష్టించిన ఫ్రాంచైజీ మూవీ బాహుబలి (Baahubali) . ఇది వచ్చి పది సంవత్సరాలు గడుస్తున్నా.. ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకులను ఇప్పటికీ అలరిస్తోంది. ఈ ఐకానిక్ డ్రామా రెండు భాగాలును కలపి 'బాహుబలి: ది ఎపిక్' (Baahubali: The Epic) గా తీసుకొచ్చి అభిమానులకు గొప్ప బహుమతిని ఇచ్చారు. అయితే తాజాగా దీని నిర్మాతలు మరో క్రేజీ థాట్ తో ముందుకు వచ్చారు. బాహుబలి యూనివర్స్ లోకి మరిన్ని సినిమాలు రాబోతుండటం ఆసక్తికరంగా మారింది.


బాహుబలి యూనివర్స్ లో భాగంగా 'బాహుబలి: ది ఎటర్నల్ వార్' (Baahubali’s Eternal War) పేరుతో ఓ యానిమెటెడ్ మూవీని మేకర్స్ రెడీ చేస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన టీజర్ ను విడుదల చేయగా అది విశేషంగా ఆకట్టుకుంటోంది. రమ్యకృష్ణ (Ramya Krishnan) వాయిస్‌తో ఈ టీజర్ ప్రారంభమైంది. బాహుబలి మరణం ఒక ముగింపు కాదు… అది ఒక మహా కార్యానికి ప్రారంభం అంటూ గంభీరమైన డైలాగులను రమ్యకృష్ణ చెబుతోంది.. తన గమ్యం యుద్ధం..' అంటూ స్టోరీపై క్యూరియాసిటీ పెంచింది. చూస్తుంటే బాహుబలి మరణం తరువాత అతని ఆత్మ మరో లోకం చేరడం.. అక్కడ దేవతలతో యుద్ధం చేయబోతున్నట్టుగా అర్థమవుతోంది.

శివలింగం ముందు బాహుబలి నృత్యం చేయడం, అలాగే బాహుబలి కోసం ఇంద్రుడు – విశాసురుడు మధ్య పోరాట ఘట్టం ఈ టీజర్ లో హైలెట్ గా నిలుస్తోంది. ఈ సిరీస్ అసలు బాహుబలి కథకు కొనసాగింపు కాకుండా డివోషనల్, ఫాంటసీ యాక్షన్ యానిమేషన్‌గా ఉండబోతున్నట్లు అర్థమవుతోంది. విజువల్ ట్రీట్ గా రాబోతున్న ఈ యానిమేషన్ సిరీస్‌కు ఇషాన్ శుక్లా (Ishan Shukla) డైరెక్షన్ చేస్తున్నాడు. రాజమౌళి (Rajamouli) సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. అనుకున్నట్టుగా సాగితే.. ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’ 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి యానిమెటెడ్ మూవీ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి...

Read Also: Allu Aravind: నాకంటూ ఓ స్దాయి ఉంది.. నేను మాట్ల‌డ‌ను! బండ్ల‌న్న‌కు.. అల్లు అర‌వింద్‌ అదిరిపోయే కౌంట‌ర్

Read Also: Bandla Ganesh: స్టేజిపై అనడం ఎందుకు.. మళ్లీ క్షమించమని కోరడమెందుకు

Updated Date - Nov 05 , 2025 | 05:13 PM