సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Athadu Re-Release: అడ్వాన్స్ బుకింగ్స్ లో దంచికొడుతున్న అతడు

ABN, Publish Date - Aug 05 , 2025 | 01:31 AM

ప్రస్తుతం టాలీవుడ్ లో రీరిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెల్సిందే. స్టార్ హీరోల పుట్టినరోజులుకు మేకర్స్.. ఆ హీరోల పాత సినిమాలను రీరిలీజ్ చేస్తూ అభిమానులను ఒకపక్క అలరిస్తూనే ఇంకోపక్క కలక్షన్స్ రాబట్టుకుంటున్నారు.

Athadu

Athadu Re-Release: ప్రస్తుతం టాలీవుడ్ లో రీరిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెల్సిందే. స్టార్ హీరోల పుట్టినరోజులుకు మేకర్స్.. ఆ హీరోల పాత సినిమాలను రీరిలీజ్ చేస్తూ అభిమానులను ఒకపక్క అలరిస్తూనే ఇంకోపక్క కలక్షన్స్ రాబట్టుకుంటున్నారు. ఇంకో వారం రోజుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) పుట్టినరోజు వస్తుంది. ఆరోజున అభిమానులకు మేకర్స్ పెద్ద గిఫ్ట్ ఇచ్చారు. మహేష్ కెరీర్ లో మంచి హిట్ అందుకున్న అతడు (Athadu) సినిమాను మహేష్ పుట్టినరోజు అయిన ఆగస్టు 9 న రిలీజ్ చేయనున్నారు.


మహేష్, త్రిష జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అతడు సినిమా 2005 లో రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ ను అందుకుంది కానీ, భారీ విజయాన్ని అందుకోలేకపోయింది. కానీ, టీవీలో మాత్రం అతడు భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా ఆగస్టు 9 న రిలీజ్ అవుతుందని మేకర్స్.. ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే అతడు రీరిలీజ్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా రీరిలీజ్ కాకముందే రికార్డు సృష్టించింది. ఇంకా రిలీజ్ కు వారం రోజుల ముందే ఓవర్సీస్ లో హంగామా సృష్టించింది.


అడ్వాన్స్ బుకింగ్స్ లో అతడు వారం రోజులు రిలీజ్ కు ముందే రూ. కోటి రూపాయల మార్క్ ను దాటింది. ఇప్పటివరకు ఏ రీ రిలీజ్ సినిమా ఇలాంటి రికార్డ్ ను క్రియేట్ చేయలేదు. ఒక్క ఓవర్సీస్ లోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అతడు రికార్డ్ సృష్టించింది. ఇప్పటికే ఈ సినిమాను నైజాంలో ఏషియన్ సునీల్ రిలీజ్ చేస్తున్నారు. హైదరాబాద్ లోని పలు థియేటర్లలో హౌస్ ఫుల్ అయ్యిపోయాయి. దీంతో మహేష్ ఫ్యాన్స్.. అది మా హీరో రేంజ్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమా రిలీజ్ తరువాత ఎలాంటి కలక్షన్స్ రాబడుతుందో చూడాలి.

Akhanda 2: ఎట్టకేలకు అఖండ వెనక్కి తగ్గినట్టేనా..

Rajinikanth: శ్రీదేవిని ప్రాణంకన్నా ఎక్కువగా ప్రేమించిన రజినీకాంత్.. ప్రపోజ్ చేద్దామనుకొనేలోపు

Updated Date - Aug 05 , 2025 | 01:31 AM