Akhanda 2: ఎట్టకేలకు అఖండ వెనక్కి తగ్గినట్టేనా..

ABN , Publish Date - Aug 05 , 2025 | 01:00 AM

ఆగస్టు నెల అంతా టాలీవుడ్ మొత్తం కళకళలాడిపోతుంది. చిన్నా పెద్ద సినిమాలు పోటీలకు దిగుతున్నాయి. ఇక ఆగస్టు విషయం పక్కన పెడితే.. ప్రస్తుతం అందరి చూపు సెప్టెంబర్ పైనే ఉంది. అందుకు కారణం రెండు పెద్ద సినిమాలు ఒకేరోజు రావడమే.

Akhanda

Akhanda 2: ఆగస్టు నెల అంతా టాలీవుడ్ మొత్తం కళకళలాడిపోతుంది. చిన్నా పెద్ద సినిమాలు పోటీలకు దిగుతున్నాయి. ఇక ఆగస్టు విషయం పక్కన పెడితే.. ప్రస్తుతం అందరి చూపు సెప్టెంబర్ పైనే ఉంది. అందుకు కారణం రెండు పెద్ద సినిమాలు ఒకేరోజు రావడమే. ఆ రెండు సినిమాలే OG, అఖండ 2(Akhanda 2). నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), పవన్ కళ్యాణ్(Pawan Kalyan) చాలాకాలం తరువాత యుద్దానికి సిద్ధమయ్యారు. అందులో ఈసారి ఈ ఇద్దరూ ఒకే కూటమిలో పదవులు కలిగి ఉన్నవారు కావడంతో వీరిద్దరి సినిమాలు ఒకేరోజు వస్తున్నాయి అంటే అవి కచ్చితంగా రాజకీయ వివాదాలకు కూడా దారితీస్తాయి.


ఇక మొదటి నుంచి కూడా సెప్టెంబర్ 25 న ఈ రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయని ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేశారు. ఒకటి కాకపోతే ఇంకొకటి కచ్చితంగా వాయిదా పడుతుంది అనుకుంటున్న ప్రతిసారి తాము తగ్గేది లేదు అంటూ మేకర్స్ కొత్త కొత్త పోస్టర్స్ తో రిలీజ్ డేట్స్ కూడా ప్రకటించారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం కచ్చితంగా అఖండ 2 నే వెనక్కి తగ్గుతుందని తెలుస్తోంది. అవును.. అఖండ 2 .. సెప్టెంబర్ 25 నుంచి తప్పుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.


OGకి భయపడి, యుద్ధంలో ఓడిపోతాం అని కాకుండా అఖండ 2 వెనకడుగు వేయడానికి కారణం ఉందని తెలుస్తోంది. అదేంటంటే.. అఖండ 2 పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తికాకపోవడంతో మేకర్స్ వెనక్కి తగ్గారని సమాచారం. ఈ విషయాన్ని మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారట. ఈ విషయం క్లారిటీ రావడంతో OG సినిమా నుంచి మొదటి సింగిల్ ను రిలీజ్ చేశారట. ఇక దీంతో OG సింగిల్ గానే థియేటర్ లోకి రానుంది. మరి ఈ సినిమాతో పవన్ OG ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Rajinikanth: శ్రీదేవిని ప్రాణంకన్నా ఎక్కువగా ప్రేమించిన రజినీకాంత్.. ప్రపోజ్ చేద్దామనుకొనేలోపు

Tamannaah Bhatia: ఛీ.. మొటిమలు పోవాలంటే ఆ పని చేయమంటున్న తమన్నా

Updated Date - Aug 05 , 2025 | 08:16 AM