Mirai: మనోజ్ ను అభినందించిన రజనీకాంత్

ABN , Publish Date - Sep 02 , 2025 | 02:43 PM

'మిరాయ్' ట్రైలర్ ను ఇటీవల రజనీకాంత్ చూసి, చిత్ర బృందాన్ని అభినందించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా మనోజ్ తెలియచేశాడు. 'మిరాయ్'లో మనోజ్ కీలక పాత్రను పోషించాడు.

Mirai Movie

'హనుమాన్' (Hanuman)తో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు తేజ సజ్జా (Teja Sajja). అతని తాజా చిత్రం 'మిరాయ్' (Mirai) ఈ నెల 12న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు... సినిమాపై అమాంతంగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాలో రాకింగ్ స్టార్ మంచు మనోజ్ (Manchu Manoj) కీలక పాత్రను పోషించాడు. ఇటీవల సూపర్ స్టార్ రజనీకాంత్ ను కలిసి మనోజ్ ఈ ట్రైలర్ ను ప్రత్యేకంగా ఆయనకు చూపించాడు. దాన్ని చూసి చాలా బాగుందంటూ రజనీకాంత్ (Rajinikanth) మనోజ్ ను అప్రిషియేట్ చేశారు. గ్రాండ్ స్కేల్ లో మూవీ మేకింగ్ తో పాటు మనోజ్ క్యారెక్టర్ పవర్ ఫుల్ గా ఉందంటూ రజనీకాంత్ అభినందించారు. 'మిరాయ్' మూవీతో సూపర్ స్టార్ రజనీకాంత్ బ్లెస్సింగ్స్ తనకు దక్కడం పట్ల రాకింగ్ స్టార్ మంచు మనోజ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.


'మిరాయ్' సినిమాతో మనోజ్ తన కెరీర్ లో మరో కొత్త ప్రయత్నం చేస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈ సినిమాను టీ.జీ. విశ్వప్రసాద్ నిర్మించాడు. ఇందులో రితికా నాయక్, శ్రియ శరణ్, జయరామ్, జగపతి బాబు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

Also Read: OG Craze Peaks: 'ఓజీ' ఒక్క టిక్కెట్‌ రూ.5 లక్షలు..

Also Read: Justin Bieber: వధువుకి షాకిచ్చిన జస్టిన్‌ బీబర్‌..

Updated Date - Sep 02 , 2025 | 02:44 PM

Mirai Making: సూపర్‌ యోధగా తేజ.. చుక్కలు చూపిస్తున్నారుగా..  

Mirai Song: వైబ్‌ ఉంది బేబీ.. వైబ్‌ ఉందిలే ..

Mirai Song: సాంగ్ లోనే కాదు.. కుర్రాడిలో కూడా మంచి వైబ్ ఉందిగా

Mirai: ఇదే చరిత్ర.. ఇదే భవిష్యత్తు.. ఇదే మిరాయ్‌..

Mirai: తేజ సజ్జా ‘మిరాయ్’ తెలుగు గ్లింప్స్