Birthday Boy: ఆశిష్ కొత్త సినిమా దేత్తడి
ABN , Publish Date - May 01 , 2025 | 05:20 PM
'రౌడీ బోయ్స్' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆశిష్... ఆ తర్వాత 'లవ్ మీ' సినిమాలో నటించాడు. ఇప్పుడు 'దేత్తడి' పేరుతో ఓ మాస్ సినిమా చేయబోతున్నాడు.
ప్రముఖ నిర్మాత, దిల్ రాజు (Dil Raju) సోదరుడు శిరీష్ (Shirish) తనయుడు ఆశిష్ (Ashish) హీరోగా నిలదొక్కుకోవడానికి సకల ప్రయత్నాలు చేస్తున్నాడు. 'రౌడీ బోయ్స్'గా జనం ముందుకు వచ్చిన ఆశిష్ గత యేడాది 'లవ్ మీ' (Love me) చిత్రంలో నటించాడు. ఇప్పటికే ఆశిష్ తో 'సెల్ఫిష్' (Selfish) మూవీని నిర్మిస్తున్న దిల్ రాజు, శిరీష్... తమ బ్యానర్ లోని 60వ చిత్రాన్ని అతనితోనే నిర్మిస్తున్నట్టు ఇటీవల ప్రకటించారు. ఈ సినిమాతో ఆదిత్య రావు గంగసాని (Aditya Rao Gangasani) ని దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. మే 1 ఆశిష్ బర్త్ డే సందర్భంగా ఆ సినిమా పేరును ప్రకటించారు.
ఆశిష్ కొత్త సినిమాకు 'దేత్తడి' (De Thadi) అనే పేరును ఖరారు చేశారు. ఈ చిత్రం ద్వారా హైదరాబాద్ వీధుల్లో చోటు చేసుకునే కల్చర్ తో నిండిన భావోద్వేగాలను అందించబోతున్నట్టు మేకర్స్ తెలిపారు. హీరో బర్త్ డే సందర్భంగా మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ నూ విడుదల చేశారు. ఇందులో ఆశిష్ హైదరాబాద్ వీధుల్లో కనిపించే డప్పు వాద్యకారుడి గెటప్‌లో ఉత్సాహంగా కనిపిస్తున్నారు. భుజాలపై డప్పు తగిలించుకుని రెండు స్టిక్స్‌తో బలంగా మోగిస్తుండగా, మూడో స్టిక్‌ను పళ్ల మధ్యలో పట్టుకుని, అతని ముఖం మొత్తం జోష్‌తో నిండిపోయి ఉంది. అతని దుస్తులు కూడా అతని క్యారెక్టర్‌ను ప్రజెంట్ చేస్తూ మాస్ ఫీల్‌ను ఇస్తున్నాయి. బ్యాక్‌డ్రాప్‌లో డప్పులు మోగుతున్న గుంపు చుట్టూ జనం ఉత్సాహంగా డాన్స్ చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇది సినిమాకు ఎంత ఎనర్జీగా ఉంటుందో సూచిస్తోంది. ఈ సినిమాకు సంగీతం మరో ప్రధాన బలంగా నిలవనుంది. దర్శకుడు స్వయంగా మ్యూజికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాడు కావడంతో సినిమాలో సౌండింగ్ ఇన్నోవేటివ్ గా ఉండబోతుంది. ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చే ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళుతుందని దిల్ రాజు, శిరీష్ తెలిపారు.
Also Read: Talasani Sai Kiran: విశ్వక్ సేన్ హీరోగా కల్ట్ మూవీ
Also Read: Bhogi: భీమ్స్ ను తప్పించారా... తప్పుకున్నాడా...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి