Talasani Sai Kiran: విశ్వక్ సేన్ హీరోగా కల్ట్ మూవీ

ABN , Publish Date - May 01 , 2025 | 02:34 PM

హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా యంగ్ హీరో విశ్వక్ సేన్ దూకుడు చూపిస్తున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. తాజాగా మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) ప్రస్తుతం 'ఫంకీ' (Funky)మూవీ చేస్తున్నాడు. అయితే... ఈ మధ్య వచ్చిన 'లైలా' (Laila) మూవీ పరాజయం కావడంతో డీలా పడిన విశ్వక్ ఇప్పుడిప్పుడే పర్ ఫెక్ట్ స్క్రిప్ట్స్ పై దృష్టి పెట్టాడు. ఆచితూచి అడుగులూ వేస్తూ ముందుకు సాగాలని అనుకుంటున్నాడు. ఇందులో భాగంగా కేవలం స్క్రిప్ట్ మీదనే కాదు దర్శక, నిర్మాతల మీద కూడా ఫోకస్ పెట్టాడు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సినిమాను ఫర్ ఫెక్ట్ గా పట్టాలెక్కించి, అంతే చక్కగా దానిని విడుదల చేసే వారి కోసం చూస్తున్నాడు. ఈ క్రమంలో విశ్వక్ సేన్ ఓ యువ నిర్మాతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అతను మరెవరో కాదు... ప్రముఖ రాజకీయ నాయకుడు తలసాని శ్రీనివాస యాదవ్ తనయుడు సాయి కిరణ్‌ (Talasani Sai Kiran). నిజానికి సాయికిరణ్ కు సినిమాల కంటే రాజకీయాలపైనే మక్కువ ఎక్కువ. తండ్రి బాటలో పాలిటిక్స్ లోకి అడుగు పెట్టి ఒకసారి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి కిషన్ రెడ్డితో పోటీ పడ్డాడు. అప్పుడు ఓటమి పాలయ్యాడు. దాంతో రాజకీయాలకు స్వస్తి చెప్పి... ఇప్పుడు సినిమా రంగాన్ని కెరీర్ గా ఎంచుకోబోతున్నట్టు తెలుస్తోంది. విశేషం ఏమంటే... తలసాని శ్రీనివాస యాదవ్ సైతం గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రిగా సేవలు అందించాడు. దానికి ముందు నుండే సినిమా పరిశ్రమతో తలసాని శ్రీనివాస యాదవ్ కు సత్ సంబంధాలు ఉన్నాయి.


నిజానికి తలసాని శ్రీనివాస యాదవ్ సోదరుడు శంకర్ యాదవ్ కూడా గతంలో 'చిన్ని చిన్ని ఆశ' పేరుతో ఓ సినిమాను రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad), ఇంద్రజ (Indraja)జంటగా సినిమా నిర్మించాడు. రేలంగి నరసింహారావు ఆ సినిమాకు దర్శకత్వం వహించారు. అయితే ఇటీవలే శంకర్ యాదవ్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఇప్పుడు సాయి కిరణ్‌ బాబాయి బాటలో సినిమా నిర్మాతగా మారుతున్నాడని అనుకోవచ్చు. విశ్వక్ సేన్ తో సాయి కిరణ్ తీసే సినిమాకు 'కల్ట్' అనే పేరును పెట్టబోతున్నారట. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియబోతున్నాయి.

Also Read: NTR: వార్ 2 విషయమై నాగవంశీ వివరణ

Also Read: Bhogi: భీమ్స్ ను తప్పించారా... తప్పుకున్నాడా...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 01 , 2025 | 05:00 PM