Bhartha Mahasayulaku Wignyapthi: స్టేజీపై డ్యాన్స్ ఇరగదీసిన.. డింపుల్, ఆషిక
ABN, Publish Date - Dec 21 , 2025 | 06:52 AM
రవితేజ కథానాయకుడిగా కిశోర్ తిరుమల తెరకెక్కిస్తున్న చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి ఈవెంట్‌లో స్టేజీపై డ్యాన్స్ చేసి ఆహుతులను అలరించారు.
రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా కిశోర్ తిరుమల (Kishore Tirumala)తెరకెక్కిస్తున్న చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’(Bhartha Mahasayulaku Wignyapthi). ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బేనర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. డింపుల్ హయాతి (Dimple Hayathi), ఆషికా రంగనాథ్ (Ashika Ranganath)కథానాయికలు. సునీల్, సత్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కిశోర్ తిరుమల మాట్లాడుతూ ‘పూర్తి స్థాయి వినోదంతో అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ ఆకట్టుకునేలా ఈ చిత్రం ఉండబోతోంది. రవితేజతో మంచి కుటుంబ కథా చిత్రం చేయాలనే ఈ కథ రాసుకున్నాను. ఆయన మార్క్ కామెడీ ఉంటూనే నా స్టైల్‌లో సాగుతుంది. మన జీవితాన్ని తెరపై చూసుకున్నట్లే ఉంటుంది. అందర్నీ మెప్పిస్తుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు.
సుధాకర్ చెరుకూరి మాట్లాడుతూ ‘ఇది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే చిత్రం. కచ్చితంగా ఘనవిజయం సాధిస్తుంది’ అని చెప్పారు. ‘ఇందులో బాలామణి పాత్రలో కనిపిస్తా’ అని డింపుల్ హయాతి తెలిపారు. ‘ఆధునిక సంబంధాలను వినోదాత్మకంగా చూపిస్తున్నాం’ అని ఆషికా రంగనాథ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా డింపుల్, అషికాలు బెల్లా బెల్లా ఆషా బెల్లా, అద్దం ముందు నిలబడి అబద్దం చెప్పలేనే పాటలకు స్టేజీపై డ్యాన్స్ చేసి ఆహుతులను అలరించారు.