Anushka Shetty: ఘాటీ సినిమాకు అదే మైనస్ కానుందా..
ABN, Publish Date - Aug 27 , 2025 | 05:04 PM
లేడి సూపర్ స్టార్ అనుష్క శెట్టి (Anushka Shetty) ఎప్పుడెప్పుడు మళ్లీ వెండితెరపై కనిపిస్తుందా అని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న విషయం తెల్సిందే.
Anushka Shetty: లేడి సూపర్ స్టార్ అనుష్క శెట్టి (Anushka Shetty) ఎప్పుడెప్పుడు మళ్లీ వెండితెరపై కనిపిస్తుందా అని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న విషయం తెల్సిందే. రెండేళ్ల క్రితం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందకు వచ్చిన స్వీటీ.. మళ్లీ ఇప్పుడు ఘాటీ సినిమాతో ప్రేక్షకుల ముందకు రానుంది. క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi)దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో విక్రమ్ ప్రభు (Vikram Prabhu) హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అన్నీ బావుండి ఉంటే ఈపాటికే ఘాటీ రిలీజ్ అయ్యి ఉండేది. కానీ, కొన్ని కారణాల వలన ఈ సినిమా సెప్టెంబర్ 5 కి వాయిదా పడింది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు.
అయితే ఇక్కడే పెద్ద సమస్య వచ్చింది. ప్రమోషన్స్ లో స్వీటీ పాల్గొనడం లేదు. ఈ విషయాన్ని నిర్మాత రాజీవ్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. సినిమా ఒప్పుకున్నప్పుడే తాను ప్రమోషన్స్ కు రాను అని చెప్పిందని, దానికి అంగీకరించే తాము ఈ సినిమాను మొదలుపెట్టినట్లు తెలిపాడు. నిజం చెప్పాలంటే స్వీటీ చేసిన ఈ పనే సినిమాకు మైనస్ అయ్యేలా ఉందని సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో సినిమా తీయడం ముఖ్యం కాదు.. ఆ సినిమాకు ప్రమోషన్స్ ఎంత బాగా చేశారు అనేది ముఖ్యం. సినిమాకు కోట్లు పెట్టినా పెట్టకపోయినా ప్రమోషన్స్ కు మాత్రం కోట్లు ఖర్చు పెడుతున్నారు. అలా పెడితేనే సినిమా జనాల్లోకి వెళ్తుంది. అందుకే కుర్ర హీరోలు, సీనియర్ హీరోలుఅని తేడా లేకుండా ప్రమోషన్స్ కు వస్తున్నారు.
అంతెందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం.. పాలిటిక్స్ ను పక్కన పెట్టి మరీ తన సినిమా కోసం హరిహర వీరమల్లును ప్రమోట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఓజీ ప్రమోషన్స్ లో కూడా పాల్గొననున్నాడు. ఇంకోపక్క అసలు ప్రమోషన్స్ లో పాల్గొను అని అని ఖరాకండీగా చెప్పిన నయనతారనే మన శంకర్ వరప్రసాద్ ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. వేరే భాష హీరోలు తెలుగులో వారి సినిమా రిలీజ్ అవుతుంది అంటే.. భాష నేర్చుకొని మరీ ఇక్కడ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇలా అందరూ వారి సినిమాను హిట్ చేయించుకోవడాని నానా తంటాలు పడుతున్నారు.. ఎందుకు.. ఎందుకంటే వారు కనిపిస్తేనే సినిమాపై హైప్ పెరుగుతుంది కాబట్టి.
మరి లేడి ఓరియెంటెడ్ సినిమా అన్నప్పుడు హీరోయిన్ లేకుండా ప్రమోషన్స్ చేస్తే ఎలా.. ? కనీసం ఒక్క ఈవెంట్ లో కూడా హీరోయిన్ కనిపించకపోతే జనాలు ఎలా థియేటర్స్ కు వస్తారు. ప్రేక్షకులు.. డైరెక్టర్స్ ను చూసో.. నిర్మాతను చూసో థియేటర్ కు రారు.. హీరోహీరోయిన్ల ముఖాలు చూసి వస్తారు. వారు ప్రమోషన్స్ లో కనిపించకపోతే ఎలా.. ? ఒకప్పుడు స్వీటీ ఇలా లేదు. ఇప్పుడెందుకు ఇలా చేస్తుంది. దానికి కారణం ఏంటి.. ? మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ప్రమోషన్స్ లో కూడా ఆమె కనిపించలేదు. కనీసం ఆ సినిమా ప్రమోషన్స్ బాధ్యతలను హీరో నవీన్ పోలిశెట్టి భుజాన వేసుకున్నాడు. కానీ, ఇక్కడ హీరో విక్రమ్ ప్రభు కూడా స్వీటీ లాగే చేతులు ఎత్తేసినట్లు కనిపిస్తున్నాడు.
ఇలా అయితే ఘాటీ పరిస్థితి ఏంటి.. ? సరే పోనీ స్వీటీ వేరే సినిమాలతో బిజీగా ఉంది.. తీరిక లేదు అనుకోవడానికి కూడా లేదు. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్నది ఒకే ఒక్క సినిమా. దాన్ని షెడ్యూల్ మేనేజ్ చేసుకోవడం ఆమెకు ఈజీ. అయినా కూడా అనుష్క.. ప్రమోషన్స్ కు రావడం లేదు అంటే ఏంటి కారణం.. అంటే ఆమె బరువు అని కొందరు చెప్పుకొస్తున్నారు. తనెక్కడ బయటకు వస్తే ఆమె బరువుపై మళ్లీ చర్చలు.. ట్రోల్స్ నడుస్తాయని, వాటికి భయపడే ఆమె రావడం లేదని అంటున్నారు. ఏదిఏమైనా ట్రోల్స్ కు భయపడి.. బాగా హిట్ అయ్యే సినిమాను చేజేతుల్లారా నాశనం చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. మరి డైరెక్టర్ క్రిష్ ఒక్కడే ఈ ప్రమోషన్స్ ను నెత్తిన వేసుకొని ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి.
Mirai Movie: అనుకున్న డేట్ కే మిరాయ్.. పోటీ తప్పదా
Sundarakanda Review: నారా రోహిత్ 'సుందరకాండ' మెప్పించిందా