Ghaati Trailer: సీతమ్మోరు లంకాదహనం చేస్తే ఇట్టాగే ఉండేదేమో

ABN , Publish Date - Aug 06 , 2025 | 05:52 PM

ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈరోజే ఎదురవుతుంటే.. అని ఆనందంతో గంతులు వేయడం మొదలుపెట్టారు అనుష్క (Anushka) అభిమానులు.

Anushka

Ghaati Trailer: ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈరోజే ఎదురవుతుంటే.. అని ఆనందంతో గంతులు వేయడం మొదలుపెట్టారు అనుష్క అభిమానులు. రెండేళ్ల నుంచి ఎప్పుడెప్పుడు స్వీటీ ఇలా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుందా!? అని వెయ్యి కళ్ళతో ఎదురుచూసినవారికి ఇన్నాళ్లకు ఘాటీ ట్రైలర్ ద్వారా ఆ అవకాశం దక్కింది. ఎట్టకేలకు ఘాటీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఘాటీ. యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమాలో విక్రమ్ ప్రభు హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.


అన్ని బావుండి ఉంటే ఈపాటికే ఘాటీ రిలీజ్ అయ్యి నెల అయ్యేది. కారణాలు ఏమైనా ఘాటీ వాయిదాల మీద వాయిదాలు పడుతూ చివరకు సెప్టెంబర్ 5 న రిలీజ్ కానున్నట్లు తాజాగా ట్రైలర్ లో రివీల్ చేశారు. ఇక ట్రైలర్ గురించి చెప్పాలంటే ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. స్వీటీని అభిమానులు ఇన్నాళ్లు స్వీటిని ఎలా చూడాలనుకున్నారో అలా ట్రైలర్ లో అనుష్క నట విశ్వరూపం చూపించేశారు. ఎంతో ఆనందమైన జీవితం.. ప్రేమించినవాడితో పెళ్లి, పిల్లలు.. జీవితం మొత్తం హ్యాపీగా ఉండాలన్న అమ్మాయి జీవితం ఒక్క ఘటనతో తలకిందులైపోతుంది. అంతలా ఆ అమ్మాయి జీవితాన్ని మార్చింది ఎవరు..? డబ్బుల కోసం ఘాటీల జీవితాలను నాశనం చేస్తుంటే ఆ అమ్మాయి ఏం చేసింది..? ఏలా ఎదురు తిరిగింది.. ? చివరకు తాను అనుకున్నవిధంగా తన వారికి న్యాయం చేయగలిగిందా? అనేది సినిమా కథగా ఈ ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.


అనుష్కకు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి అని చెప్పొచ్చు. ఇక అనుష్కకు సపోర్ట్ గా విక్రమ్ కూడా అదరగొట్టేశాడు. ఒకప్పుడు బరువు వలన ఇబ్బంది పడిన స్వీటీ.. ఇందులో కూడా కొంత వరకూ అలానే కనిపించింది. కాకపోతే ఎడిటింగ్ తో మేనేజ్ చేసినట్లు తెలియవస్తోంది. అయితే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలోలా మరీ బయటపడకుండా జాగ్రత్త పడ్డారు. క్రిష్ ఈసారి స్వీటీని చాలా అంటే చాలా హైప్ ఇచ్చే క్యారెక్టర్ తో ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చినట్లు తెలియస్తోంది.


ఇక ప్రతి డైలాగ్ లోని ఆమె పౌరుషం.. జేజమ్మ, భాగమతిని గుర్తుచేస్తున్నాయి. ముఖ్యంగా చివర్లో సీతమ్మోరు లంకాదహనం చేస్తే ఇట్టాగే ఉండేదేమో అనే డైలాగ్ క్లాప్స్ కొట్టించేలా ఉంది. ఇక చైతన్యరావుని కొత్త పాత్రలో చూడబోతున్నామని అర్ధం అవుతోంది. మొత్తానికి ట్రైలర్ తోనే సినిమాపై హైప్ క్రియేట్ చేసింది క్రిష్ బృందం. సాగర్ నాగవెల్లి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో అదరగొట్టేశాడు. విజువల్స్ కానీ, క్రిష్ టేకింగ్ కానీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. కథ ఏ మాత్రం ప్రేక్షకులకు ఎక్కినా ఘాటీని ఆపడం ఎవ్వరి తరం కాదని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

Chiranjeevi - Anil Ravipudi: అదిదా సర్ ప్రైజ్ అనేలా మెగా సర్ ప్రైజ్

Vijay Devarakonda: ఆ యాప్స్ లీగల్.. అందుకే ప్రమోట్ చేశా

Updated Date - Aug 06 , 2025 | 06:06 PM