Anupama Parameswaran: టిల్లు స్క్వేర్ లో నటించడం నచ్చలేదు
ABN, Publish Date - Aug 12 , 2025 | 06:47 PM
ఇండస్ట్రీలో నటించేవారందరూఅన్ని సినిమాలు నచ్చే చేయరు. కొన్ని నచ్చకపోయినా తామెంటో నిరూపించుకోవాలని చేస్తారు. ఇంకొన్ని తప్పక వేరే ఛాన్స్ లేక చేస్తారు.
Anupama Parameswaran: ఇండస్ట్రీలో నటించేవారందరూఅన్ని సినిమాలు నచ్చే చేయరు. కొన్ని నచ్చకపోయినా తామెంటో నిరూపించుకోవాలని చేస్తారు. ఇంకొన్ని తప్పక వేరే ఛాన్స్ లేక చేస్తారు. అవి హిట్ అయినా కూడా వారి మనస్సులో ప్రత్యేకమైన స్థానాన్ని ఆ సినిమాలు నింపుకోలేకపోతాయి. తాజాగా కుర్ర హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) నటించిన టిల్లు స్క్వేర్ (Tillu Square) ఆమెకు ఎంత మంచి పేరును తీసుకొచ్చి పెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆ సినిమా చేయడం అనుపమకు నచ్చలేదట. ప్రస్తుతం ఆమె నటించిన పరదా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్నీ చెప్పుకొచ్చింది.
సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజే టిల్ల ఎంత పెద్ద విజయం అందుకుందో అందరికీ తెల్సిందే. ఇందులో నేహా శెట్టి అందాలు ఫ్యాన్స్ ను ఫిదా చేశాయి. ఈ సినిమాకు సీక్వెల్ గాటిల్లు స్క్వేర్ వస్తుంది అని తెలియడంతో రాధికా పాత్రను మైమరిపించే హీరోయిన్ ఎవరా అని అందరూ ఎంతగానో ఎదురుచూసారు. ఆ సమయంలోనే అనుపమ.. లిల్లీ పాత్రలో నటిస్తుంది అని తెలియడంతో ఫ్యాన్స్ షాక్ అయ్యారు. అప్పటివరకు గ్లామర్ రోల్స్ చేయని అనుపమ.. ఒక్కసారిగా అందాలను అరబోయడంతో పాటు ముద్దులు, హగ్గులు అంటూ రెచ్చిపోతుందా అని ఫ్యాన్స్ దుమ్మెత్తిపోశారు. ఇంకోపక్క ఆ పాత్రకు ఆమె సెట్ కాదని, అనవసరంగా కెరీర్ ను పాడుచేసుకుంటుందని కామెంట్స్ చేశారు.
విమర్శలను పట్టించుకోకుండా అనుపమ లిల్లీ పాత్రలో ఒదిగిపోయింది. అందాలను ఆరబోయడమే కాకుండా విలన్ గా నటించి మెప్పించింది. ఎవరైతే ఆమెను విమర్శించారో.. సినిమా రిలీజ్ అయ్యాకా వారే ఆమెను ప్రశంసించారు. అలా టిల్లు స్క్వేర్ అనుపమ కెరీర్ లో బిగ్గెస్ట్ మలుపుగా మారింది. అయితే ఈ లిల్లీ పాత్ర అనుపమకు నచ్చలేదు. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ.. ' నా ఫ్యాన్స్ కు నేను ఆ పాత్రచేయడం నచ్చలేదు అని కాదు.. నాకు కూడా అది నచ్చలేదు. అది తప్పు అని నేను చెప్పను. కానీ, ఆ పాత్ర ఒప్పుకోవడానికే నాకు చాలా సమయం పట్టింది.
ఈ సినిమా చేయాలా వద్దా అని ఎన్నోసార్లు ఆలోచించాను. సెట్ లోకి వెళ్లి 100 శాతం కాన్ఫిడెన్స్ గా నటించలేకపోయాను. సినిమాల్లో కానీ, ప్రమోషన్స్ లో కానీ ఆ డ్రెస్ లు నాకు కంఫర్ట్ అనిపించలేదు. అన్ని సినిమాలు ఎలా చేసానో ఇది కూడా అలానే చేశాను. అయితే ఈ సినిమా చేసేటప్పుడు నాకు భయమేసింది. అందరూ నన్ను ఏమనుకుంటారో అని.. విమర్శలు వస్తాయని ముందే అనుకున్నాను. అలాగే వచ్చాయి' అని అనుపమ చెప్పుకొచ్చింది.
Monica Bellucci: మోనికా సాంగ్ చూసి మోనికా బెలూచి ఏమన్నదంటే..
Kantara: Chapter 1: కాంతారా ఛాప్టర్ 1.. ప్రమాదాలు.. నిర్మాత క్లారిటీ