AndhraKingTaluka: మొన్న లిరిసిస్ట్.. నేడు సింగర్..
ABN, Publish Date - Sep 05 , 2025 | 08:17 PM
ఉస్తాద్ రామ్ పొత్తినేని (Ram Pothineni) ఆశలన్నీ ఆంధ్రా కింగ్ తాలూకా (Andhra King Taluka) సినిమాపైనే పెట్టుకున్నాడు. గత కొన్నేళ్లుగా రామ్ ఒక మంచి హిట్ ను కూడా అందుకోలేదు.
Andhra King Taluka: ఉస్తాద్ రామ్ పొత్తినేని (Ram Pothineni) ఆశలన్నీ ఆంధ్రా కింగ్ తాలూకా (Andhra King Taluka) సినిమాపైనే పెట్టుకున్నాడు. గత కొన్నేళ్లుగా రామ్ ఒక మంచి హిట్ ను కూడా అందుకోలేదు. అందుకే ఈసారి ఆంధ్రా కింగ్ తాలూకా కోసం బాగా కష్టపడుతున్నాడు. మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఇక ఈ చిత్రంలో రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా నువ్వుంటే చాలు సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచింది.
నువ్వుంటే చాలు సాంగ్ కు రామ్ నే లిరిక్స్ అందించిన విషయం తెల్సిందే. అదేం విచిత్రమో కానీ, ఈ సినిమా కోసం రామ్ కొత్త కొత్త అవతారాలు ఎత్తుతున్నాడు. మొదటి సాంగ్ కు లిరిసిస్ట్ గా మారిన ఉస్తాద్.. రెండో సాంగ్ కోసం సింగర్ గా అవతారం ఎత్తాడు. ఆంధ్రా కింగ్ తాలూకా కినిమా నుంచి రెండో సాంగ్ అప్డేట్ వచ్చేసింది. పప్పీ షేమ్ అంటూ సాగే ఈ సాంగ్ ను సెప్టెంబర్ 8 న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఇక తాజాగా ఈ సాంగ్ ను ఎవరు పాడుతున్నారో గెస్ చేయండి అంటూ ఒక చిన్న వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో హీరోయిన్ భాగ్యశ్రీ, డైరెక్టర్ మహేష్ బాబు తో సహ మిగతా టెక్నీషియన్స్ అందరూ కలిసి ఈ సాంగ్ ను ఎవరు పాడబోతున్నారో తెలుసా.. హింట్ ఇస్తాం. ఈ మధ్యే సెన్సేషన్ అయిన లిరిసిస్ట్ .. అబ్బో భయంకరమైన డ్యాన్సర్.. అంటూ రామ్ గురించి పెద్ద హింట్సే ఇచ్చారు. ఈ సాంగ్ కు సంబంధించిన ఒక చిన్న టీజ్ ను రేపు రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. మునుపెన్నడూ లేనివిధంగా రామ్.. ఇలా లిరిసిస్ట్ గా, సింగర్ గా మారడం ఏంటి.. ? సినిమాపై హిప్ క్రియేట్ చేయడానికా.. ? లేక ఎప్పుడు ప్రయత్నించలేదని ఇప్పుడు చేస్తున్నాడా.. ? అనేది చూడాలి.
Anushka Moni Mohandas: వ్యభిచార దందా.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిన హీరోయిన్
TRON:'ట్రాన్: ఏరీస్' ట్రైలర్ రిలీజ్