Anushka Moni Mohandas: వ్యభిచార దందా.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిన హీరోయిన్
ABN , Publish Date - Sep 05 , 2025 | 06:19 PM
ఇండస్ట్రీలో కొందరు ఎంత కష్టపడి వస్తున్నారో.. అంతే ఈజీగా తప్పుదోవ పడుతున్నారు. అవకాశాలు లేక కొంతమంది, డబ్బు కోసం కొంతమంది.. బలవంతంగా నటీమణులు .. వ్యభిచార కూపంలోకి లాగబడుతున్నారు.
Anushka Moni Mohandas: ఇండస్ట్రీలో కొందరు ఎంత కష్టపడి వస్తున్నారో.. అంతే ఈజీగా తప్పుదోవ పడుతున్నారు. అవకాశాలు లేక కొంతమంది, డబ్బు కోసం కొంతమంది.. బలవంతంగా నటీమణులు .. వ్యభిచార కూపంలోకి లాగబడుతున్నారు. కొంతమంది సీనియర్ నటీమణులు.. కొత్తగా వచ్చేవారిని ప్రలోభపెట్టి, భయపెట్టి.. వ్యభిచార దందాలోకి లాగుతున్నారు. అలా ఇద్దరు కుర్ర నటీమణులను వ్యభిచార కూపంలోకి లాగుతున్న ఒక బెంగాలీ నటిని పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆమె పేరు అనుష్క మోని మోహన్ దాస్ (Anushka Moni Mohandas).
బెంగాలీలో పలు సినిమాల్లో కనిపించి.. గుర్తింపు తెచ్చుకున్న అనుష్క దాస్ సోషల్ మీడియాలో కూడా మంచి పాపులారిటీ తెచ్చుకుంది. ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చే హీరోయిన్స్ ను, డబ్బు కావాలనేవారిని వెతికి.. వారందరికీ డబ్బు ఎరగా చూపించి వ్యభిచారంలో అక్రమంగా తరలిస్తుంది. మహారాష్ట్రలో ఠాణే జిల్లాలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార దందానే నడిపిస్తుంది.
ఇక ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. ఆమెను పట్టుకోవాలని పక్కా ప్లాన్ వేసి సెప్టెంబర్ 5 న ఇద్దరు నటీమణులను అక్రమంగా తరలిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆమె దగ్గర ఉన్న ఇద్దరు యువతులను పోలీసులు కాపాడారు. ప్రస్తుతం ఈ న్యూస్ సినీ పరిశ్రమను షేక్ చేస్తోంది. ఇలాంటివారు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారని, ఈమె పట్టుబడింది.. వారు బయటకు రాలేదు అంతే తేడా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Mana Shankaravaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్‌గారు’ మరో అప్‌డేట్ వచ్చేసింది
Shilpa Shetty: చీటింగ్ కేస్.. శిల్పాశెట్టి దంపతులకు లుకౌట్ నోటీసులు