Andhra King Taluka: రామ్ పాడిన పాట వచ్చేసింది.. విన్నారా
ABN , Publish Date - Sep 08 , 2025 | 05:47 PM
ఉస్తాద్ రామ్ పోతినేని ( Ram Pothineni) హీరోగా మహేష్ బాబు పి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆంధ్రా కింగ్ తాలూకా (Andhra King Taluka).
Andhra King Taluka: ఉస్తాద్ రామ్ పోతినేని ( Ram Pothineni) హీరోగా మహేష్ బాబు పి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆంధ్రా కింగ్ తాలూకా (Andhra King Taluka). మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) నటిస్తుండగా.. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్. సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇప్పటివరకు యాక్షన్ సినిమాలతో మాస్ హీరో కావాలని చాలా ప్రయత్నాలు చేసి రామ్ ఓడిపోయాడు. ఇక తనకు ఆచ్చి వచ్చిన లవ్ స్టోరీతో మళ్లీ రాబోతున్నాడు.
ఇక ఈ సినిమా కోసం రామ్ మునుపెన్నడూ లేనివిధంగా లిరిక్స్ అందించాడు.. సింగర్ గా మారాడు. నువ్వుంటే చాలు సాంగ్ కు లిరిక్స్ అందించిన రామ్.. పప్పీ షేమ్ సాంగ్ కు అయితే ఏకంగా సింగర్ గానే మారిపోయాడు. మొన్న శాంపిల్ కు ప్రోమో వదిలిన మేకర్స్ తాజాగా ఫుల్ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. సాంగ్ మొత్తం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. కాలేజ్ కుర్రాడు సాగర్ అనే పాత్రలో రామ్ కనిపించబోతున్నాడు.
పాలిటెక్నిక్ కాలేజ్ లో ఆంధ్రా కింగ్ ఉపేంద్రకు పెద్ద ఫ్యాన్ సాగర్..ఆంధ్రా కింగ్ సినిమా ప్లాప్ అవుతుందనో.. లేక ఇంకేదైనా విషయంలోనో వేరే ఫ్యాన్స్ బెట్ కట్టి ఓడిపోవడంతో వారిని పప్పీ షేమ్ అంటూ ఏడిపిస్తూ వారికి తమ హీరో గొప్పతనం గురించి చెప్పే సమయంలో ఈ సాంగ్ వస్తుందని తెలుస్తోంది. ఉపేంద్ర కటౌట్స్, ఆంధ్రా కింగ్ అనే బ్యానర్లు సాంగ్ మొత్తంలో కనిపించాయి. ఇక వేరే హీరో ఫ్యాన్స్ ను రామ్ ఒక ఆట ఆడుకున్నట్లు సాంగ్ లో కనిపిస్తుంది. భాస్కరభట్ల లిరిక్స్ చాలా క్యాచీగా.. రైమింగ్ తో అదిరిపోయాయి. ఇక విజయ్ పోలంకి డ్యాన్స్ మూవ్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు. మొత్తానికి ఈ సాంగ్ కూడా సోషల్ మీడియాలో బాగా వినపడుతుందని అనిపిస్తుంది. మరి ఈ సినిమాతోనైనా రామ్ ఒక మంచి విజయాన్ని అందుకుంటాడో లేదో చూడాలి.
Sanjay Dutt: రెండు హత్యలు చేసిన ఖైదీ నాకు గడ్డం గీశాడు..
The Ba***ds of Bollywood: షారుఖ్ ఖాన్ తనయుడి.. మూవీ ట్రైలర్ వచ్చేసింది