Sanjay Dutt: రెండు హత్యలు చేసిన ఖైదీ నాకు గడ్డం గీశాడు..

ABN , Publish Date - Sep 08 , 2025 | 05:20 PM

బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ (Sanjay Dutt) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Sanjay Dutt

Sanjay Dutt: బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ (Sanjay Dutt) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేజీఎఫ్ 2 సినిమాతో విలన్ గా గుర్తింపు తెచ్చుకున్న సంజయ్ దత్.. ఆ తరువాత సౌత్ లోనే స్థిరపడ్డాడు. డబుల్ ఇస్మార్ట్ లో విలన్ గా కనిపించినా అది ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. ఇకపోతే ప్రస్తుతం ది రాజాసాబ్ చిత్రంలో ప్రభాస్ కు తాతగా కనిపించబోతున్నాడు. తెలుగులోనే కాకుండా హిందీలో కూడా బిజీగా ఉన్న సంజయ్ దత్.. తన స్నేహితుడు సునీల్ శెట్టితో కలిసి ది కపిల్ శర్మ షోలో పాల్గొన్నారు.


ఇక ఈ షోలో ఎన్నో విషయాలను పంచుకున్న సంజయ్ దత్.. జైల్లో ఉన్నప్పటి జ్ఞాపకాలను పంచుకున్నాడు. 1993 లో జరిగిన ముంబై పేలుళ్ళ ఆయుధాల కేసులో సంజయ్ దత్ ను 2013 లో అరెస్ట్ చేశారు. జైల్లో మూడేళ్లు శిక్షను అనుభవించి సంజయ్ బయటపడ్డాడు. సంజయ్ జైలు జీవితం కథతో సంజు అనే సినిమా కూడా వచ్చింది. ఇక జైల్లో తాను అందరితోనూ మంచిగా మాట్లాడేవాడినని చెప్పుకొచ్చాడు.


'జైల్లో గడ్డం బాగా పెరిగిపోవడంతో సూపరిండెంట్ ను గడ్డం గీయడానికి ఎవరైనా ఉన్నారా అని అడిగితే.. అతను మిశ్రా అనే వ్యక్తిని పంపాడు. ఇక అతను నా ఎదురుగా కూర్చొని గడ్డం గీస్తుంటే.. ఎంతకాలం నుంచి జైల్లో ఉంటున్నావ్ అని అడిగాను. అతను 15 ఏళ్లుగా అన్నాడు. ఏం తప్పు చేసి జైలుకు వచ్చావ్ అని అడిగితే.. రెండు మర్డర్లు చేశాను అన్నాడు. అప్పుడే అతని చేతిలో ఉన్న కత్తి నా మెడ మీద ఉంది. వెంటనే నేను అతని చేతిని పట్టుకున్నాను. అలా మా ఇద్దరి మధ్య చిన్న సంభాషణతో ఆ రోజు గడిచింది.


ఇక అక్కడ ఉన్నవారిలో చాలా టాలెంట్ ఉంది. నేను జైల్లో కుర్చీలు, కాగితపు సంచులు తయారుచేశాను. ఒక రేడియో స్టేషన్ కూడా నడిపాను. అది కేవలం అక్కడే ప్లే అయ్యేది. అందుకు నాకు డబ్బులు కూడా ఇచ్చారు. కొందరు ఖైదీలు స్క్రిప్ట్ రాసేవారు. దానికి నేను డైరెక్టర్ గా చేస్తే.. మిగతావారు నటించారు. నా జీవితంలో జరిగిన దేని గురించి కూడా నేను బాధపడలేదు. కాకపోతే నా తల్లిదండ్రులు మరణం నన్ను బాధపెట్టింది. వారిని ఇప్పటికీ మిస్ అవుతున్నాను' అంటూ సంజయ్ దత్ చెప్పుకొచ్చాడు.

Nivetha thomas: బరువు తగ్గిన నివేదా థామస్.. మరీ ఇంత అందంగా ఉంటే ఎలా

Kamal- Rajini: ఒకే ఫ్రేమ్ లో కమల్, రజనీ

Updated Date - Sep 08 , 2025 | 05:48 PM